
… వాక్యమును ప్రకటించుము; సమయమందును అసమయ మందును ప్రయాసపడుము; సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము గద్దించుము బుద్ధి చెప్పుము. —2 తిమోతి 4:2
నేను పరిచర్య కొరకు ప్రయాణం చేయుచున్నప్పుడు నేను తరచుగా హోటల్స్ లో బస చేస్తాను. నేను నా గదిలో ఉన్నప్పుడు “నన్ను డిస్టర్బ్ చేయవద్దు” అనే గుర్తును తలుపు మీద పెడతాను కాబట్టి ఎవరూ నన్ను డిస్టర్బ్ చేయరు. హోటల్ గదిలో ఈ గుర్తును వ్రేలాడదీయుటకు అంగీకారమే. కానీ దీనిని నా జీవితములో వ్రేలాడ దీయుటకు అంగీకారము లేదు.
దేవుడు మన వేళా పట్టిక ప్రకారము లేక మనకు అనుకూల సమయంలో పని చేయడానిని మీరు గుర్తించారా? దేవుని సేవకులుగా మరియు సువార్త పరిచారకుడుగా పౌలు తిమోతితో అతనికి వీలుగా ఉన్నా లేకపోయినా అతడు తన బాధ్యతను నెరవేర్చాలని చెప్పి యున్నాడు.
మనము ఈరోజు ఉన్నట్లుగానే తిమోతి కూడా అనుకూలతకు అలవాటు పడియుండవచ్చు. కానీ ఒకవేళ అతడు దానిని వినవలసి వచ్చినప్పుడు, మనము కూడా చాలా తరచుగా వినవలసినవారమై యున్నాము.
దేవుని పిలుపు మనకు అసౌకర్యముగా ఉన్నట్లయితే మన హృదయాలకు “డిస్టర్బ్ చేయవద్దు” అనే గుర్తును వ్రేలాడ దీయడం చాల సులభమే, కానీ మనము దీనిని చేయుట వలన గొప్ప అవకాశములను కోల్పోతున్నాము. దేవుడు మనలను ఏమి చేయాలని చెప్పినప్పటికీ ఆ ప్రక్రియలో మనము అనుకూలత లేక కష్టమును అనుభవించుట యోగ్యమైనదని మనము గుర్తించవలసిన అవసరత ఉన్నది. మరియు మనము ఆయనకు విధేయత చూపినప్పుడు దానిని పూర్తి చేయుటకు దేవుడు మనకు ఎల్లప్పుడు మార్గమును కలుగజేస్తాడు.
ప్రారంభ ప్రార్థన
దేవా, నా హృదయముపై యున్న “నన్ను డిస్టర్బ్ చేయవద్దు” అనే గురుతును తీసివేయుటకు నేను ఎంపిక చేసుకున్నాను. ఒకవేళ అది నాకు అసౌకర్యముగా ఉన్నప్పటికినీ నేను నీకు విదేయుడనై మీరు నాకు చేయమని చెప్పిన దానిని నేను చేస్తాను.