నలుగ గొట్టబడే అవసరత

నలుగ గొట్టబడే అవసరత

ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమునుబట్టి నానా విధములైన శోధనలచేత, ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది.  నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణ మగును. … —1 పేతురు 1:6-7

నలుగ గొట్టబడుట అను మాట కొంత మంది ప్రజలలో భయమును కలిగిస్తుంది, కానీ ఇది నిజముగా చెడ్డ మాట కాదు. దేవుడు మన ఆత్మలను విరుగ గొట్టాలని ఆశించుట లేదు, కానీ దాని బయటి గుడ్డును పగుల గొట్టాలని ఆశిస్తున్నాడు. ఆ గుడ్డు పెంకు దేవుడు మన ద్వారా చేయాలనీ ఆశించిన వాటిని చేయకుండా ఆపుతుంది. దేవుడు మనలో ఉన్న గర్వము, తిరుగుబాటు, స్వార్ధము మరియు స్వాతంత్ర్యమును పగుల గొట్టాలని ఆశిస్తున్నాడు. దేవుడు మనలను పూర్తిగా ఆయన మీద ఆధారపడి యుండాలని ఆశిస్తున్నాడు మరియు బాధపడుట ద్వారా మనలను ఆ స్థితికి నడిపిస్తుండి.

కొన్నిసార్లు ప్రజలు శోధన మరియు కష్ట సమయాల గుండా వెళ్ళవలసి ఉందని అనుకుంటారు. మనము నమ్మకముగా ఉండి దేవుని వాక్యమునకు విధేయత చుపుతున్నప్పుడు కూడా శోధనలు వస్తూనే ఉంటాయి. మరియు కొన్నిసార్లు మన విశ్వాసమును పరిశోధించుటకు మరియు పరిశుద్ధ పరచుటకు శోధనలు వస్తాయి.

మన మార్గంలో ఈ శోధనలు వస్తున్నప్పుడు, వాటిని హత్తుకోండి, ఎందుకంటే అవి యదార్ధమైన విరుగుదలకు నడిపిస్తాయి. దేవుడు మనలను ఆత్మ ద్వారా జీవించమని కోరుతున్నాడు, కానీ శరీరము ద్వారా కాదు మరియు మనము ఏ విధమైన పాపము లేక స్వార్ధపరమైన ఆలోచనలను విరుగ గొట్టుటకు ఆయనను అనుమతించినప్పుడు మన జీవితాలను కట్టి యుంచిన అలవాట్లు మనలను విడిచి పెడతాయి.

ఈరోజు మీరు దేవునికి సన్నిహితముగా ఉండాలని ఆశిస్తున్నవా? అయితే గొప్ప విషయాలు జరుగునట్లు మీ భవిష్యత్తును నడిపించే విరుగ గొట్టబడుటను హత్తుకోండి.


ప్రారంభ ప్రార్థన

పరిశుద్ధత్మా, నాకు కొన్నిసార్లు విరుగ గొట్టబడుట అవసరమని నేను గుర్తించాను. అది సౌకర్యముగా ఉండక పోవచ్చు, కానీ నన్నువిరుగ గొట్టుటకు మరియు నన్ను పట్టి పీడిస్తున్న అలవాటుల నుండి నేను విడిపించబడుటకు నేను మిమ్మును ఆహ్వానిస్తున్నాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon