అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది; అది ఇప్పుడును వచ్చేయున్నది; తన్ను ఆరాధించువారు అట్టివారే కావలెనని తండ్రి కోరు చున్నాడు. —యోహాను 4:23
ఆరాధన అనునది పాటలు పడుట కంటే అధికమైనది. అది హృదయము మరియు మనస్సు యొక్క స్థితియై యున్నది. ఒక చిన్న పాట పడకుండా దేవునిని ఆరాధించ వచ్చును. దేవునికి మనము అర్పించే ఆరాధన హృదయములో జన్మించి, మన ఆలోచనలను నింపి, మనము మాట్లాడే మాటల ద్వారా మరియు మనము జీవించే విధానము ద్వారా మనము వ్యక్తీకరించగలము.
కొన్నిసార్లు ఆరాధన అనునది మతముగా అలోచించవచ్చును, అది లేఖన పరమైన ఉద్దేశ్యము నుండి దూరంగా లేదు. అది ప్రజల నుండి వచ్చే వ్యక్తిగత సంబంధము మరియు హృదయములో నుండి భక్తితో కూడిన వ్యక్తీకరణయై యున్నది. అదియే నిజమైన ఆరాధన.
ఆయనను ఆత్మతోను సత్యమును ఆరాధించు వారిని దేవుడు కోరుకుంటూన్నాడని దేవుని వాక్యము సెలవిస్తుంది.
ఎవరైనా ఆయనను ఆరాధించుట అయన కోరుకొనుట లేదనే విషయం నాకు చాల ఆసక్తికరముగా ఉన్నది. అయన సత్యములో నిజాయతీగా జీవించే యదార్ధ వంతుల కొరకు అయన ఆశిస్తున్నాడు. భయముతో లేక మతపరముగా ఆయనను ఆరాధించుట అయన కోరుకొనుట లేదు.
నిజమైన ఆరాధన అనునది దేవునితో కలిగియున్న సన్నిహిత సంబంధము యొక్క ఫలితమై యున్నది. ఈరోజు మీ పూర్ణ హృదయముతో ఆరాధించండి మరియు ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధికులుగా మారండి!
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, నేను మీకు కేవలం నా పెదవులను అర్పించాలని ఆశించుట లేదు. బదులుగా, నిజమైన ఆరాధికుడుగా నేను మీకు నా జీవితమును అర్పించి సన్నిహితముగా మీతో అనుసంధానమును కలిగి యుంటాను. మీరు నాకెంతో మంచివారుగా ఉన్నారు మరియు నేను మిమ్ములను ఆత్మతోను సత్యముతో ఆరాధిస్తాను.