
మనమాయనయందు బ్రదుకుచున్నాము, చలించు చున్నాము, ఉనికి కలిగియున్నాము… —అపోస్తలుల కార్యములు 17:28
ప్రేమ జీవితం యొక్క శక్తి. ఇది ప్రతి రోజు నిలపడానికి మరియు కొనసాగించడానికి ప్రజలను ప్రోత్సహిస్తుంది. ఇది జీవితమునకు ప్రయోజనం మరియు అర్థం ఇస్తుంది.
ప్రజలు వారిని ప్రేమించే వారు ఉండరు లేక వారు ప్రేమించబడరనే అనుభూతిని తమ జీవితాల్లో కొన్నిసార్లు కలిగి ఉంటారు. వారు ఈ మనస్తత్వమును మొదటి నుండి కలిగియుంటారు ఎందుకనగా వారు మొదట బాగుగా ఉన్న విషయాలు నెరవేర్చుట కోసం చూస్తారు కానీ తరచుగా వాటిని విసుగు, నిరాశ మరియు లోపల ఖాళీ భావనతో ఉంటారు.
ఇది మీకు సంభవిస్తుందా? మీరు ఎప్పుడైనా ప్రేమ కోసం చూసి, నెరవేరని అనుభూతి చెందుతున్నారా? నన్ను ఇలా అడగనివ్వండి: మీరు ఏ విధమైన ప్రేమను అనుసరిస్తున్నారు?
మీరు ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారని అనుకోవచ్చు, కాని నిజంగా మీరు దేవుని కోసం చూస్తున్నారు ఎందుకంటే ఆయన ప్రేమయై యున్నాడు. మీరు పొందే ఏ ప్రేమయైన అది దేవుని నుండి దురపరిచేదైతే ఆ ప్రేమ నిజంగా ప్రేమ కాదు మరియు మీమ్మల్ని నెరవేరని అనుభూతితో నింపుతుంది.
బైబిల్ ఇలా చెప్తుంది, మనము ఆయనలో నివసిస్తున్నాము, మనలో ఆయనను కలిగియున్నాము. ఆయనకు లేకుండానే, జీవితం పూర్తి కాదని ఈ విషయం నాకు చెప్తుంది.
అందరూ ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారు, కానీ మీరు దేవుని ప్రేమ కోసం ఎదురు చూస్తున్నారా? ఇది యోగ్యమైన ప్రేమ మాత్రమే, నిలిచి యుండే ప్రేమ మాత్రమే, మరియు అది నెరవేర్చే ప్రేమయై యున్నది.
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, నేను నెరవేర్చబడని లేక నిన్ను అనుసరించని ప్రేమ కలిగిన జీవితాన్ని గడపటానికి నేను ఇష్టపడను. అది మీలో కనబడక పోతే, అది నిజమైన ప్రేమ కాదు, ఎందుకంటే మీరు ప్రేమయై యున్నారు. నేడు, నీలో నా ప్రేమను నేను కనుగొన్నాను.