నిజాయితీ పరిపూర్ణతను అధిగమిస్తుంది

నిజాయితీ పరిపూర్ణతను అధిగమిస్తుంది

అయితే కుయుక్తిగా నడుచు కొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, సత్యమును ప్రత్యక్షపరచుటవలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి యెదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు, అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి యున్నాము.   —2 కొరింథీ 4:2

మనలను గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో అనే విషయాన్ని గురించి ఎక్కువగా దృష్టి నుంచినప్పుడు అది మనలను పూర్తిగా కదలకుండా చేస్తుంది మరియు మనలను తప్పుగా చూడటాన్ని గురించి భయపడతాము.  కానీ మీకు తెలుసా?  సమస్తమును దాచి పెట్టి మనము పరిపూర్ణులమని చూపించుటకు ప్రయత్నించుట కంటే మనము ఎక్కువగా సత్యముతో ఉన్నట్లైతే మనము ఎక్కువ గౌరవాన్ని పొందుకుంటాము.

నేను నా స్వంత సమస్యలు, బలహీనతలు మరియు పొరపాటుల నుండి నేనేమి నేర్చుకున్నానో దానినే బోధిస్తాను గనుక ప్రజలు నేను చెప్పే దానిని వినుటకు ఇష్టపడతారని నేను భావిస్తాను. అది వారిని శాంతింపజేసి, నా సమస్యతో పోల్చుకొనుట ద్వారా నేనేదైతే చేసి యున్నానో వారు కూడా వాటిని అనుసరించుట ద్వారా వారిలో నిరీక్షణ కలుగుతుంది.

మనము పొరపాట్లు చేస్తూనే ఉంటాము కాబట్టి తప్పులు చేస్తామనే భయంతో జీవించుట మనము ఆపి వేయాలి.  మనము నిజాయితీగా ఉండాలని మరియు మన తప్పులను గురించి ఒప్పుకునే స్థితిలో ఉండాలని ఆయన కోరుతున్నాడు.  మనము వాటిని బహిర్గతము చేసినప్పుడు వాటినుండి బయటపడుటకు ఆయన సహాయం చేయును మరియు పెద్ద మరియు అతి పెద్ద విషయాలలోనికి వెళ్ళునట్లు మనల్ని నడిపించును.

మీ పొరపాటులను దాచవద్దు. వాటిని బహిర్గతం చేయండి తద్వారా మీరు వాటి నుండి నేర్చుకుంటారు. మీరు దేవునిని నిజాయితీతో మరియు నిర్మలత్వముతో నమ్మినట్లైతే మీరు సమస్తమును జయించుటకు ఆయన మీకు సహాయపడును.


ప్రారంభ ప్రార్థన

ప్రభువా, నేను సిగ్గుపడునట్లు నేను బలహీనతలను కలిగి యున్నాను, కానీ వాటిని పట్టుకొని యుండుట వలన నాకేమీ లాభము కలుగదు. నా పొరపాటుల విషయంలో నేను బహిరంగముగా ఉండాలని ఆశిస్తున్నాను కాబట్టి వాటిని జయించుటకు మీరు నాకు సహాయం చేయగలరు.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon