దేవుని (సహాయమును) బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను దేవునియందు నమ్మికయుంచి యున్నాను నేను భయపడను శరీరధారులు నన్నేమి చేయగలరు? —కీర్తనలు 56:4
మీరు ఆటలు ఆడుటలో, మాస్కులు ధరించుటలో లేక మీవలె కాక మరోకరివలె కనపడుటకు ప్రయత్నించుటలో విసిగి పోయారా? మీకు నిజంగా ఎలా ఉండాలో తెలియని వ్యక్తిగా ఉండాలనే ఒత్తిడి లేకుండా, మీరు ఎవరో అంగీకరించే స్వేచ్ఛ మీకు ఇష్టం లేదా? మీ ప్రత్యేకతను హత్తుకొని ఎలా ఉండాలో నేర్చుకొనుటకు ఇష్టపడుతూ, ఇతరులవలె ఉండుటకు బలవంత పెట్టబడుటను నిరాకరిస్తున్నారా?
ఒకవేళ మీరు అభద్రతలను జయించుచు దేవుడు మిమ్మును పిలిచిన పిలుపుకు తగినట్లుగా ఉండాలని ఆశించినట్లైతే మీరు విభిన్నత కలిగి యుండుటకు ధైర్యమును కలిగి యుండవలెను. మన ప్రత్యేకతను విడిచి పెట్టి ఒకరి వలె ఉండుటకు ప్రయత్నించిన యెడల మనలో సంతోష లేమి మరియు నిరాశను కలిగి యుంటాము.
మీరు ఎందుకు సృష్టించబడ్డారో అలాగే మిమ్మల్ని అంగీకరించాలని దేవుడు ఆశిస్తున్నాడు కానీ ఇతరులు ఆశించిన రీతిగా లేక మీరెలా ఉండాలని ప్రజలు ఆశిస్తున్నారో అలా ఉండమని దేవుడు ఆశించుట లేదు. నేను ప్రజలను సంతోషపెట్టువానిగా ఉన్నానా లేక దేవుని సంతోశపెట్టువానిగా ఉన్నానా అని మిమ్మును మీరు ప్రశ్నించుకోవాలి. మనుష్యులను కాక దేవునిని సంతోషపెట్టు వారిగా ఉన్నట్లయితే మీలో నిజమైన శాంతి మరియు ఆనందము కలుగుతుంది.
దేవుడు నిన్ను సృష్టించినప్పుడు ఆయన ఏమి చేయుచున్నాడో ఆయన ఎరిగి యున్నాడు. మీరు ఒక ప్రత్యేకమైన వ్యక్తి –దేవుని ద్వారా అద్భుతముగా తయారు చేయబడ్డారు! మిమ్మల్ని మీరు క్రీస్తు యేసులో నూతన సృష్టిగా మిమ్మును మీరు అంగీకరించండి మరియు మీరు ఆయనలో ఏమైయున్నారనే విషయాన్ని కనుగొనుట ద్వారా భద్రతను పొందుకోండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను ప్రజలకు భయపడను. నేను నీలో కలిగియున్న నా సంబంధములో నా భద్రతను ఆత్మ విశ్వాసమును వెదకాలని ఆశిస్తున్నాను. ఈరోజు, నేను ఎలా ఉండాలని నన్ను సృష్టించి యున్నవో అలా ఉండుటకు ప్రత్యేకమైన వ్యక్తిగా ఉంటాను. నేను నిన్ను సంతోషపెట్టాలని కోరుచున్నాను.