
…నీవు నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలె ననునది రెండవ ఆజ్ఞ… —మార్కు 12:31
నిన్ను నీవు ప్రేమించని యెడల మీ జీవితములో ఆనందించుట చాలా కష్టము. ప్రజలు తమతో తాము ముందుకు సాగని యెడల ఇతరులను కూడా వారు అంగీకరించలేరు లేక సఖ్యముగా ముందుకు సాగలేరు.
నేను ప్రజలతో సంబంధాలను కలిగి యుండుటకు అనేక సంవత్సరములు చాలా కష్టంగా గడిపాను, కానీ నేను నా కష్టములతో మునిగిపోయి ఉన్నప్పుడు ఇతరులతో కలిసి యుండుట ఎంత కష్టమో నేను వాక్యమును ధ్యానించుట ద్వారా తెలుసుకున్నాను. నన్ను నేను ఇష్టపడుట లేదు!
మంచి చెట్టు మంచి ఫలమును ఫలిస్తుంది, మరియు చెడ్డ చెట్టు చెడ్డ ఫలమును ఫలిస్తుందని బైబిల్ గ్రంధము చెప్తుంది. అదే విధముగా మన జీవిత ఫలము మనలో ఉన్న వేరును బట్టి వస్తుంది. మనము అదే అవమానము, అపరాధ భావన, న్యూనతా భావము, తృణీకారభావము, ప్రేమలేమి మరియు అంగీకరించబడకపోవుట మొదలగు ఫలములు మీ సంబంధములను బాధిస్తాయి.
ఏది ఏమైనా దేవుడు మీ కొరకు కలిగియున్న దేవుని నిబంధనలు లేని ప్రేమను గురించిన ప్రత్యక్షతను ఒకసారి కలిగి యున్నట్లైతే మరియు మిమ్మును మీరు మరియు ఇతరులను కూడా అంగీకరించుటకు ప్రారంభించిన యెడల క్రమేణా ఈ క్రొత్త వేరులు మంచి ఫలములను ఫలిస్తాయి మరియు మీ సంబంధములు మెరుగవుతాయి.
ఏ వేరులతో మీరు నాటబడ్డారు? ఈరోజే మీ హృదయమును పరీక్షించుకోండి మరియు దేవుడు తన ప్రేమయనే నేలలో మిమ్మును నాటగలడని ప్రార్ధించండి, తద్వారా మీరు మిమ్మల్ని మరియు ఇతరులకు కూడా యధార్ధముగా ప్రేమించ గలరు. మీరు ఈరోజే ఆయనలో వేరుపారునట్లు చూడండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, నీవు నా యెడల కలిగియున్న ప్రేమలో వేరు పారి జీవించాలని ఆశిస్తున్నాను. మీ ప్రేమ లేకుండా, నన్ను నేను ప్రేమించలేను మరియు ఇతరులను కూడా ప్రేమించలేను, కాబట్టి నేను ఈరోజు దానిని పొందుకొనుచున్నాను.