అడుగుడి మీకియ్యబడును. వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు (ద్వారము) తీయబడును. —మత్తయి 7:7
మీరు మీ జీవితములోని ఒక పరిస్థితిను గురించి ప్రార్ధిస్తూ మీరు విజయం కోసం ఎదురు చూస్తున్నారా? ఇంకా జవాబు ఎందుకు రాలేదని మీరు ఆశ్చర్య పోతున్నారా? మీరు పొందాల్సిన విజయం మిమ్మల్ని దాటి వెళ్తుందని ఆలోచిస్తున్నారా?
కొన్నిసార్లు మనము ఒక పరిస్థితిని గురించి సుదీర్ఘ మరియు కఠీనమైన ప్రార్ధనలు చేస్తూ జవాబు పొందకుండా ఉంటె మనం కేవలం అందులోనే జీవిస్తూ ఉంటాము. మన పనిలో మనము ముందుకు సాగుచుండగా, దేవుడు జవాబు ఎప్పుడు ఇస్తాడా లేక అసలు ఇవ్వడా అని ఆలోచిస్తూ ఉంటాము. కానీ దేవుడు మన ప్రార్ధనలను వింటాడు మరియు మనకు అన్ని విషయాలు తెలియక పోయినా దేవుడు జవాబుల్లో పని చేస్తూ ఉంటాడు. మన పరిస్థితి హఠాత్తుగా – ఎటువంటి హెచ్చరిక లేకుండా మారవచ్చు!
అప్పటివరకు మనము అనుకూలముగా లేక ఎదురు చూస్తూ వేచి యుండవచ్చును. నిష్క్రియాత్మక వ్యక్తి వదిలి పెట్టవచ్చు కానీ ఎదురు చూసే వ్యక్తి మరో వైపు జవాబు మనకు దగ్గరలోనే ఉందని ఒక్క నిమిషములో పొందుకుంటామని నమ్ముతాడు. అతని నమ్మకం నిష్క్రియాత్మకమైనది కాదు. అతని హృదయము నిరీక్షణతో నిండి యుంటుంది మరియు ఏ నిమిషములోనైనా తన సమస్యకు పరిష్కారం వస్తుందని నమ్ముతాడు. అతడు ప్రతిరోజూ నిద్ర లేచినప్పుడు అతని జవాబు కొరకు ఎదురు చూస్తాడు. అతడు ఎదురు చూడవచ్చు కానీ అతడు ఓపికతో దేవునిని అడుగుతుండగా దేవుడు సమస్తమును మేలు కొరకే మారుస్తాడు!
ప్రారంభ ప్రార్థన
దేవా, నిరీక్షణతో నేను ఎదురుచూస్తున్నాను కానీ నిష్క్రియాత్మకంగా కాదు. నేను నా విజయం కొరకు ఎదురు చూస్తూ మీరు నాకు దానిని సరియైన సమయంలో అనుగ్రహిస్తావని ఆశిస్తూ మిమ్మల్ని అడుగుతూనే ఉంటాను.