ఈ నిరీక్షణ నిశ్చలమును, స్థిరమునై, మన ఆత్మకు లంగరువలెనుండి తెరలోపల ప్రవేశించుచున్నది. —హెబ్రీ 6:19
మనందరమూ మన జీవితాలలో కష్టాల గుండా వెళ్తాము మరియు తుఫానులో చిక్కుకున్న ఒక ఓడ వలె, మనము స్థిరముగా ఉండాలంటే మనకు సహాయం అవసరము. ఓడ స్థిరంగా ఉండటానికి సహాయపడుటకు ఒక లంగరు ఉంటుంది, మరియు నిరీక్షణ అనునది మన ఆత్మ యొక్క లంగరు అని బైబిల్ చెబుతుంది.
మీరు మరియు నేను మన నిరీక్షణను దేవునిపైన మరియు ఆయన వాక్యముపైన దృఢంగా ఉంచినప్పుడు, మేము గాలి మరియు తరంగాలను అనుభవించవచ్చు, కాని చివరికి మనం కదలకుండా స్థిరంగా ఉంటాము.
తుఫానులో నిరీక్షణ మనకు పరిస్థితులను ఉన్నట్టుగానే చూసే సామర్ధ్యము నిస్తుంది మరియు ఎదో మంచి జరుగబోతుందనే నిరీక్షణను కలిగిస్తుంది. ఇది మీకు మరియు నాకు-ముఖ్యంగా కష్ట సమయాల్లో చాలా శక్తివంతమైన మరియు ముఖ్యమైన గుణాన్ని ఆశిస్తుంది. వాస్తవానికి, మనం నిర్మించాల్సిన విశ్వాసపు పునాది ఇదేనని నేను నమ్ముతున్నాను.
నిరాశ లేదా ఇబ్బందులను మనం ఎప్పటికీ ఎదుర్కోవాల్సిన అవసరం లేదని ఎవరూ-లేక దేవుడు కూడా వాగ్దానం చేయలేదు. కానీ ముఖ్యమైనది ఏమిటంటే, మనము ఎప్పుడూ నిరీక్షణను ఆపలేము. సానుకూల వైఖరిని కొనసాగించడం మరియు క్రీస్తుపై మనకు ఉన్న నిరీక్షణను పట్టుకొని యుండుట ద్వారా దేవుని అద్భుతంగా-పనిచేయు శక్తిని చూసే స్థితిలో మనల్ని ఉంచుతుంది.
ప్రారంభ ప్రార్థన
దేవా, నీలో నా నిరీక్షణ ఉంచి యున్నాను. నీలోని నా విశ్వాసం మరియు నా జీవితములో మీరు చేయబోయే గొప్ప విషయాలను గురించిన ఆశ నా శోధన కాలములో లంగరు వలే పని చేయుచున్నది.