నీతియుక్తమైన కోపము మరియు పాపపు ప్రతిచర్యలు

నీతియుక్తమైన కోపము మరియు పాపపు ప్రతిచర్యలు

కోపపడుడి గాని పాపము చేయకుడి; సూర్యుడస్తమించువరకు మీ కోపమునిలిచియుండకూడదు. అపవాదికి (ఎటువంటి అవకాశము) చోటియ్యకుడి; —ఎఫెసీ 4:26-27

కోపమంతయు పాపమేనా? కాదు, అందులో కొంత మాత్రమే. దేవుడు కూడా పాపము, అన్యాయము, తిరుగుబాటు మరియు జాలిపడుటలో కూడా నీతియుక్తమైన కోపమును కలిగి యుంటాడు. కోపము కొన్నిసార్లు ఉపయోగకరమైన ఉద్దేశ్యమును కలిగియుంటుంది, కాబట్టి అది ఖచ్చితముగా ఎల్లప్పుడూ పాపముతో కూడినది కాదు.

సహజంగానే, మనకు ప్రతికూల భావాలు ఉండబోతున్నాయి, లేదా దేవుడు మనకు స్వీయ నియంత్రణ ఫలాలను ఇవ్వడు. ఏదో చేయటానికి శోదించబడుట పాపం కాదు. మీరు శోధనలను ఎదిరించనప్పుడు మరియు ఏదో విధముగా దానిని చేసినప్పుడు అది పాపంగా మారుతుంది. అదే విధంగా, కోపంగా ఉండటం తప్పు కాదు, కానీ ఇది చాలా పాపాత్మకమైన చర్యలకు దారితీస్తుంది.

కోపం అనుభూతి చెందడానికి దేవుడు కొన్నిసార్లు మనలను అనుమతిస్తాడు, కాబట్టి మనం దుర్వినియోగం చేయబడినప్పుడు మేము గుర్తిస్తాము. కానీ మన జీవితంలో నిజమైన అన్యాయాలను అనుభవించినప్పుడు కూడా, మన కోపాన్ని సరికాని రీతిలో బయటపెట్టకూడదు. కోపం మనల్ని పాపంలోకి లాగడానికి అనుమతించకుండా జాగ్రత్త వహించాలి.

మనలను గురించి ఎవరైనా చెడుగా ఆలోచించినప్పుడు మనం కొన్నిసార్లు కోపగించుకొనుటకు దేవుడు మనలను అనుమతిస్తాడు. కానీ మన జీవితంలో నిజమైన అన్యాయాలను అనుభవించినప్పుడు కూడా, మన కోపాన్ని సరికాని రీతిలో బయటపెట్టకూడదు. కోపము మనల్ని పాపంలోకి లాగడానికి అనుమతించకుండా జాగ్రత్త వహించాలి.
ఎఫెసీ 4:26 కోపపడుడి కానీ పాపము చేయకుడి అని చెప్పుచున్నది. మీ కోపము పాపముతో ఉండాల్సిన అవసరం లేదు కానీ పాపపు ప్రతి చర్యను ఉత్పత్తి చేయకుండా ఆపుటకు మీరు దానిని దేవునికి అప్పగించండి.


ప్రారంభ ప్రార్థన

దేవా, పాపము లేకుండా మీరు ఆశించిన రీతిగా కోపముతో వ్యవహరించుట నాకు నేర్పును. నా కోపము మీద నేను నియంత్రణ కలిగి యుందును మరియు నాకు సమస్త మేలు కలుగుటకు అన్నియు సమకూడి జరుగునట్లు నేను మీ యందు నమ్మిక యుంచి యున్నాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon