
అయితే దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు; ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తమువలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి, మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రతనుండి రక్షింప బడుదుము. – రోమా 5:8-9
దేవుడు మిమ్మల్ని ప్రేమించాలంటే మీరు చాలినంత మంచిగా ఉండాలని ఎప్పుడైనా మీ గురించి మీరు ఆశ్చర్యపడ్డారా? అనుకోకుండా చాలామంది ప్రజలు తాము పొరపాటులు చేయకుండా ఉన్నంత వరకే దేవుడు వారిని ప్రేమిస్తాడని అనుకుంటారు.
బహుశా కీర్తనాకరుడు ఇలా అడుగుటకు ఇదియే కారణమై యుండవచ్చు, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు? (కీర్తనలు 8:4). అయినను మనము దేవుని సృష్టియని – ఆయన చేతి పనివారమని – మరియు మనలో ప్రతి ఒక్కరినీ ఆయన నిబందనలు లేకుండా ప్రేమిస్తున్నాడని బైబిల్ చెప్తుంది.
మనము దీనిని ఎదుర్కొందాము: మీరు గొప్ప వారని లేక అద్భుతమైన వారని యేసు మీ కొరకు మరణించలేదు; ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుక నీ కొరకు మరణించాడు. రోమా 5:8-9 ద్వారా మనము ఇంకనూ పాపులమై యుండగానే అయన మన కొరకు మరణించాడనే ఈ సత్యమును స్థిరపరచి యున్నది.
దేవుడు కేవలం నీ పాపముల కొరకే కాక మీ అనుదిన పొరపాటులను కప్పుటకు అయన తన అద్వితీయ కుమారుని ఇచ్చునంతగా ఆయన నిన్ను ప్రేమించాడు. అయన నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు మరియు ఆయన నిన్ను తన శక్తి మరియు విజయములో అనుదినము జీవించునట్లు ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు.
దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు మరియు మీరు తప్పులు చేసినప్పుడు కూడా ……. దానిని మీరు విశ్వసించాలని దానిని ఎల్లవేళలా పొందుకోవాలని ఆశిస్తున్నాడు.
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, మీ ప్రేమ చెప్పనశక్యమైనది. నీ ప్రేమ నాకు అర్ధం కానప్పుడు కూడా నీవు నన్ను ప్రేమించావు. నేను పొరపాటులు చేసినప్పుడు, నీవు ఇంకను నాతోనే ఉన్నావు. ఈదినము నీ నిజమైన నిబంధనలు లేని ప్రేమను బట్టి మీకు నా వందనములు!