మనలో ప్రతివాడును తన్నుగురించి దేవునికి లెక్క యొప్పగింపవలెను (తీర్పు సమయంలో దేవునికి జవాబివ్వ వలెను). —రోమా 14:12
అనేక మంది ప్రజలు వారి జీవితములో దేవుని ఉద్దేశ్యమును నెరవేర్చుటకు ప్రయత్నించరు, ఎందుకనగా వారు ఇతరులకు సంతోష పరచుటలో తీరిక లేకుండా ఉంటారు. మీ జీవితమును గురించి మీరేమి చేయవలసి యున్నదో దానిని గురించి ఆలోచించే ప్రజలతో ఈ లోకము నిండి యున్నది.
కానీ నీవెలా జీవించి యున్నావనే విషయమును గురించి ఇతరులకు కాక దేవునికి లెక్క అప్పగించవలెనని బైబిల్ చెప్తుంది. కాబట్టి మనము ప్రతి రోజు దేవుని కృప ద్వారా జీవించవలెను, ఆయనకు ఇష్టమైన మార్గములో జీవించుట మన బాధ్యతయై యున్నది.
మీరు సమూహమును కాక మీ హృదయమును అనుసరించుటకు ధైర్యమును కలిగి యున్నారా? మీ ప్రణాళిక నుండి మిమ్మును అనేక స్వరములు దూరం చేయుటకు ప్రయత్నించు చున్నప్పుడు మీరు క్రీస్తు మీద దృష్టిని ఉంచి యున్నారా?
లోకములో రెండు రకముల ప్రజలున్నారు: ఎదో ఒకటి జరగాలని కొందరు వేచి యుండువారు మరియు కొన్ని విషయాలు జరుగునట్లు చేయువారు. దేవుడు తన రాజ్యము కొరకు గొప్ప కార్యములు చేయవలేనని అయన నిన్ను పిలచి యున్నాడు – మరియు మీరు నేరవేర్చునట్లు మీకు క్రీస్తులో అవసరమైన వాటిని ఆయన ఇచ్చి యున్నాడు.
కాబట్టి ఉద్దేశ్య పూర్వకముగా ఉండుము మరియు ఉద్దేశ్యము కలిగిన జీవితమును జీవించుము. ప్రతి ఒక్కరు ఏమి చేయబోతున్నారనే విషయాన్ని చూచుటకు మరియు వారిని అనుసరించుటకు వెళ్ళవద్దు. వెలిగింపబడుము, నిర్ణయం తీసుకొనుము మరియు ముందుకు సాగుము!
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, నేను ఇతరులను కాక నీకే ఇష్టుడుగా జీవించే జీవితాన్ని జీవించాలని ఆశ పడుతున్నాను. నేను ధైర్యముగా మీరు నా యెడల కలిగియున్న ఉద్దేశ్యములోనికి అడుగు పెట్టుదును. నేను వెనకకు తిరిగి కూర్చొనను కానీ నీ కొరకు నేను ఉద్దేశ్యపూర్వకమైన జీవితాన్ని జీవిస్తాను.