నీ గురించి నీవు సత్యమును పలుకుము

నీ గురించి నీవు సత్యమును పలుకుము

నీ మాటలనుబట్టి నీతి మంతుడవని తీర్పునొందుదువు, నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు. —మత్తయి 12:37

మీ గురించి ఎప్పుడూ నేనెప్పుడూ సరియైన పనిని చేయను, నేనెప్పుడూ మారను, నేను బాగుండను, నేను భయంకరముగా ఉంటాను, నేను మూగ, నన్నెవరు ప్రేమించరు – అని మీరు వ్యతిరేకముగా ఆలోచించవద్దు. మత్తయి 12:37 చెప్పునదేమనగా మీ మాటల ద్వారా మీరు తీర్పు తీర్చబడతారు… మరియు మీ మాటల ద్వారా మీరు ఖండించ బడతారు మరియు శిక్షించబడతారు.

సామెతలు 23:7 చెప్పునదేమనగా, ఒకడు తన హృదయములో ఏమి ఆలోచించునో అదే వాని స్వభావము. మరో మాటలో చెప్పాలంటే, మనము మాట్లాడే మరియు ఆలోచించే విధానమే మనలను మనము బహిర్గతము చేసుకోను చున్నాము మరియు అది మన జీవితములను ప్రభావితం చేస్తుంది.
మీ గురించి దేవుని వాక్యం ఏమి చెప్తుందో దాని ఆధారంగా మీరు మీ గురించి మంచి విషయాలు మాట్లాడాలి (రహస్య ఒప్పుకోలు) కాబట్టి మీరు క్రీస్తులో ఎవరై ఉన్నారనే దానిపై మీకు నమ్మకం ఉంటుంది. ఉదాహరణకు: “నేను క్రీస్తులో దేవుని నీతి. నేను క్రీస్తు ద్వారా ఆమోదయోగ్యంగా ఉన్నాను. దేవుడు నన్ను సృష్టించి, తన చేతులతో నన్ను ఏర్పరచుకున్నాడు, దేవుడు తప్పులు చేయడు.”

నేను దినమును అనుకూల, బైబిల్ ఒప్పుకోలు ప్రకటిస్తూ ప్రారంభించడం నాకు ఇష్టం. మీరు పనికి వెళ్లేటప్పుడు లేదా ఇంటిని శుభ్రపరిచేటప్పుడు దీనిని చేయవచ్చు. అద్దంలో చూస్తూ, “దేవుడు నన్ను ప్రేమిస్తాడు మరియు అంగీకరిస్తాడు, నేను కూడా అలానే చేస్తాను” అని బిగ్గరగా చెప్పమని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీరు మీ గురించి దైవభక్తిగల, సానుకూలమైన సత్యాన్ని మాట్లాడటం ప్రారంభించినప్పుడు, మీరు మీలాగే ఉండుటలో విజయవంతం కావచ్చు, మీరెలా ఉండాలని దేవుడు సృష్టించాడో అలాగే ఉంటారు.


ప్రారంభ ప్రార్థన

దేవా, నా గురించి నేను మాట్లాడే ప్రతికూల మాటలను ఇక పలకను. మీరు నన్ను ప్రేమిస్తున్నారని మరియు నన్ను అంగీకరిస్తున్నారనే సత్యమును నేను ప్రకటిస్తున్నాను. నీవు నన్ను దేని నిమిత్తమైతే సృష్టించి యున్నావో అలాగే నేను ఉంటాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon