పగతీర్చుకొనుట దేవుని పని

పగతీర్చుకొనుట దేవుని పని

ప్రియులారా, మీకు మీరే పగతీర్చుకొనక, దేవుని ఉగ్రతకు చోటియ్యుడి పగతీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి యున్నది. —రోమా 12:19

ఎవరైనా మనకు కోపం కలిగించిన యెడల మనము నిరాశతో క్రుంగిపోవలెనని సాతానుడు కోరుకుంటాడు. కనికరము మరియు క్షమాపణతో మనము స్పందించిన యెడల అది శత్రువు చేయవలెనని ఆశించిన దానికి వ్యతిరేక కార్యముగా ఉంటుంది ఎందుకనగా అది అతని పథకములను విఫలం చేయును.  అది సహజముగా రాదు మరియు ఎల్లప్పుడూ అది సులభం కాదు, కానీ మనము చేయగలిగిన దానిని మనము చేసిన యెడల మనము చేయలేని దానిని దేవుడు చేయును.

ఎవరైనా మీమీద కోపగించుకొని బాధపెట్టిన యెడల మనలోన కలిగే సాధారణ స్పందన తిరిగి పగ తీర్చుకొనుట. కాని మనము అలా చేసిన యెడల మీరు నిజముగా ఏమి పొందుకుంటారు? మీరు వారిని మరింత కోపము పొందుకునేలా చేస్తారు మరియు వారు కూడా తిరిగి పగ తీర్చుకొనుటకు ప్రయత్నిస్తారు. అది ఎన్నడూ ఆగదు!

మనము కోపములో మునిగి యున్నప్పుడు, మనము కేవలము ముర్ఖులము మాత్రమే. మనము కోపము తగ్గించుకొని దానికి కారకులైన వారిని దేవునికి అప్పగించుకొనిన యెడల ఆయనే దానిని గురించి శ్రద్ధ తీసుకొనుటకు అనుమతించిన యెడల… పగ తీర్చుట నా పని, నేనే ప్రతి ఫలమిత్తును అని ప్రభువు చెప్పి యున్నాడు.

దేవుని యందు నమ్మిక యుంచుము మరియు ఆయన మీ యెడల శ్రద్ధ కలిగి మిమ్మల్ని భద్రపరచును. జరిగిన దానిని మీరు మార్చలేరు కానీ మీరు దానిని దేవునికిచ్చినప్పుడు, మీ జీవితములో మేలు జరుగునట్లు ఆయన దానిని ఉపయోగించుకొనును.


ప్రారంభ ప్రార్థన

దేవా, పగ తీర్చుట నీ పని అని నేను నమ్ముతాను మరియు కోపములో పగ తీర్చుకొనుట నేను చేసే పని కాదు. నా కోపమును నేను నీకు సమర్పించుచున్నాను మరియు మీరు నా విషయములో జాగ్రత వహిస్తారని నేను నమ్ముతున్నాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon