యెహోవా, నీవే మాకు తండ్రివి మేము జిగటమన్ను నీవు మాకు కుమ్మరివాడవు మేమందరము నీ చేతిపనియై యున్నాము. —యెషయా 64:8
మనము పరిపూర్ణులుగా ఉండాలని దేవుడు ఆశించుట లేదు – ఆయన మనలను చేసాడు మరియు మనము మానవులము మాత్రమే కాక పొరపాటులు చేస్తాము. మనం చేయవలసినదేమనగా అనుదినము మనము నిద్ర లేవగానే దేవుడు మనకిచ్చిన తలాంతులతో దేవునిని సేవించుటకు మనము చేయగల్గినదంతా చేయాలి. మనము తప్పులు చేసినప్పుడు మనము దేవుని దగ్గర ఒప్పుకొని ఆయన క్షమాపణను పొందుకొని ముందుకు సాగవలెను.
చాలా మంది ప్రజలు వారు పరిపూర్ణులు కారు గనుక దేవుడు మనలను ఉపయోగించుకోడని అనుకుంటారు, కానీ అది అబద్ధం. కుమ్మరియైన దేవుడు పగిలిన కుండలను కూడా తన పని కొరకు వాడుకుంటాడు. క్రైస్తవులుగా మనము దేవుడు తన మంచి తనము మరియు వెలుగుతో నింపే పాత్రలమై యున్నాము. అప్పుడు మనము ఈ చీకటి ప్రపంచంలోనికి దేవుని మంచితనమును మరియు వెలుగును మోసుకొని మనమెక్కడికి వెళ్ళినా దానిని ప్రజలతో పంచుకుంటాము.
మీ బలహీనతలను బట్టి మీరు భయపడవద్దు; వాటిని ఒప్పుకొనండి మరియు ఏ విధముగానైనా దేవుడు మిమ్మును వాడుకొనునట్లు అనుమతించండి. మీరు కాని దానిని గురించి చింతించవద్దు మరియు మీరేమై యున్నారో దానిని దేవునికి ఇవ్వండి. పరిపూర్ణుడైన మరియు మీలో మీతో పని చేయగల దేవునిపై మీ దృష్టిని ఉంచండి.
పగిలిన కుండగా, మీరు అద్భుతమైన విషయాలను సాధించగలరు. మీరు ఇతరులను సంతోషపరచగలరా. మీ చుట్టూ ఉన్నవారిని ప్రోత్సహించగలరు, బలపరచగలరు మరియు హెచ్చరించగలరు. దేవునిని సేవించుటకు మీరు మీ వరములను మరియు తలాంతులను వాడుకొనగలరు.
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను పగిలిన కుండను కావచ్చు, కానీ నీవు కుమ్మరివి మరియు నా బలహీనతలలో కుడా నన్ను నీ ప్రణాళికలు నెరవేర్చబడునట్లు వాడుకొనగలవు. నన్ను నీ మంచితనంతో మరియు నీ వెలుగుతో నింపండి తద్వారా నేను నా చుట్టూ ఉన్న ప్రపంచానికి వాటిని మోసుకొని వెళ్ళగలను.