తనయెడల యథార్థహృదయముగలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది; యీ విషయమందు నీవు మతి తప్పి ప్రవర్తించితివి గనుక ఇది మొదలుకొని నీకు యుద్ధములే కలుగును. —2 దిన వృత్తాంతములు 16:9
అనేక సార్లు నా జీవితములో దేవుడు మన ద్వారా సంపూర్ణ కార్యము నెరవేర్చబడాలని చూడడు కానీ పరిపూర్ణ హృదయాలు కావాలని చూస్తాడని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు.
చాలా మంది ప్రజలు తమ జీవితాలు పూర్తి పరిపూర్ణతతో నిండి యుంటేనే దేవుడు వారిని వాడుకోడని అనుకుంటారు. ఆ విధమైన ఆలోచన వారిని దేవుడు వాడుకొనుటకు అడ్డుపడుతుంది. కానీ మనమెలా ఉన్నా దేవుడు మనల్ని వాడుకుంటాడు కానీ మనలను బట్టి ఆయన వాడుకోడు.
కొన్నిసార్లు ప్రజలు మీ సామర్ధ్యము ఆధారముగా మిమ్మల్ని ప్రేమిస్తారు. వారు కోరినది మీరు చేసిన యెడల వారు నిన్ను అంగీకరిస్తారు; కానీ మీరు దానిని చేయని యెడల వారు మిమ్మల్ని నిరాకరిస్తారు. దేవుని ప్రేమ కేవలం దేవుని మీద ఆధారపడి యుంటుంది. ఆయన మీరున్నట్లుగానే మిమ్మల్ని ప్రేమిస్తారు మరియు మిమ్మల్ని అంగీకరిస్తారు.
మనము యోగ్యత లేని వైఖరిని కలిగి యుండి పరిశుద్ధ జీవితము జీవించాలని ఆశ లేకుండా ఉండుట దీని అర్ధము కాదు. ఎవరి హృదయమైతే దేవుని యెడల పరిపూర్ణంగా ఉంటుందో అతడు ఎల్లప్పుడూ అన్ని విషయాల్లో దేవునికి ఇష్టుడుగా జీవిస్తాడు, అయినను వారి బలహీనతలను బట్టి వారిని దేవుడెప్పుడూ నిరాకరించడని వారు ఎరిగి యున్నారు. ఆయన మనల్ని ప్రేమించాలని మరియు మనము బలహీనులముగా ఉన్నప్పుడు మనకు సహాయం చేయాలని ఆశిస్తున్నాడు.
దేవుడు మిమ్మల్ని ప్రేమించనివ్వండి మరియు బదులుగా పరిపూర్ణ హృదయముతో మీ ప్రేమను ఆయన కివ్వండి!
ప్రారంభ ప్రార్థన
దేవా, నా బలహీనతలు మరియు పొరపాటులలో కూడా మీరు నన్ను ప్రేమిస్తున్నారని నాకు తెలుసు. ఈ ప్రేమను బట్టి మీకు నా వందనములు మరియు నేను మిమ్మును పరిపూర్ణ హృదయముతో అనుసరించినప్పుడు మీరు నన్ను వాడు కుంటారని తెలుసుకొని నా హృదయమును మీకు సమర్పించుచున్నాను.