పరిశుద్ధాత్ముడు మన ఉద్రేకముల మీద విజయమునిచ్చును

పరిశుద్ధాత్ముడు మన ఉద్రేకముల మీద విజయమునిచ్చును

నేను తండ్రిని వేడుకొందును, మీయొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను (ఆలోచన కర్తను, సహాయకుని, విజ్ఞాపకుని, బలమిచ్చేవాడిని, ఉత్తరవాదిని మరియు స్థానభ్రంశమును) అనగా సత్యస్వరూపి యగు ఆత్మను మీకనుగ్రహించును… —యోహాను 14:16

మన మొదటి శత్రువు మన ఉద్రేకములు. మనకు ఎలా అనిపిస్తుందో దాని ద్వారా మనం నడిపించబడతాము, కానీ భావాలు చంచలమైనవని మరియు రోజు నుండి రోజుకు మారుతున్నాయని మనం గ్రహించాలి. మన మనస్సులోకి వచ్చే ప్రతి ఆలోచనను అనుసరించకుండా జాగ్రత్త వహించాలి ఎందుకంటే మన ఆలోచనలు మరియు భావాలు మనకు సత్యాన్ని నిర్దేశించవు.

ఉదాహరణకు, చాలా మంది ప్రజలు నిరాశకు గురవుతారు ఎందుకంటే వారు సత్యాన్ని ఎదుర్కోలేరు, కాని పరిశుద్ధాత్మ మనకు సత్యాన్ని వెల్లడించడానికి వచ్చియున్నాడు. మన సమస్యలకు సాకులు చెప్పడం మరియు మిగతావారిని నిందించడం కంటే మనం సత్యాన్ని ఎదుర్కోవాలి మరియు మన క్రియలకు బాధ్యత వహించాలి. మనము అలా చేసి, మనకు సహాయం చేయమని దేవునిని కోరినప్పుడు, భార భరితమైన ఆత్మ మనలను వదిలివేస్తుంది మరియు మనకు తేలికగా ఉంటుంది మరియు స్వేచ్ఛగా అనిపిస్తుంది.

పరిశుద్ధాత్మకు లోబడి, ఆయన వెల్లడించిన జ్ఞానానికి విధేయత చూపుట ద్వారా మీరు మీ భావోద్వేగాలపై విజయం సాధించవచ్చు. మనతో ఎప్పటికీ ఉండటానికి మన ఆదరణకర్త, సలహాదారు, సహాయకుడు, విజ్ఞాపన చేయువాడు, న్యాయవాది, బలము నిచ్చేవాడు మరియు ప్రత్యామ్నాయంగా ఉండటానికి యేసు ఆయనను మన దగ్గరకు పంపాడు.

దేవునికి ధన్యవాదాలు మనము నిరాశ, నిరుత్సాహము, నిస్పృహ చెందాల్సిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ మన భావోద్వేగాలపై విజయాన్ని అనుగ్రహిస్తాడు!


ప్రారంభ ప్రార్థన

పరిశుద్ధత్మా, నేను నా స్వంతగా నా ఉద్రేకములను మరియు వైఖరిని మార్చుకోలేను. నన్ను విజయములోనికి నడిపించుటకు మీ శక్తిని నాకు అనుగ్రహించినందుకు వందనములు.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon