…. మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి. – 1 పేతురు 1:16
మనము ఎలా జీవించుచున్నామనే విషయములో మనము మరికొంచెము జాగ్రత్త వహించవలసి యున్నది. మనము భయములో జీవించుటను గురించి జాగ్రత్త వహించుట కాదు కానీ లోకపరమైన విధానములో కాకుండా దైవ మార్గములో జీవించుటకు జాగ్రత్త వహించవలెను.
మన స్నేహితులు ఎటువంటి వారనే విషయంలో, మనము ఏ టివి కార్యక్రమములు లేక సినిమాలు చూస్తున్నామనే విషయంలో మరియు మన ధనమును ఎలా ఖర్చుచేస్తున్నమో అనే విషయంలో జాగ్రత్త వహించనందువలన మన జీవితాలు వృధాగా ముగించ బడతాయి.
క్రైస్తవులముగా, మనము పరిశుద్ధతను పొందుకొనవలెను మరియు మనము పరిశుద్దులమని గుర్తించుట ద్వారా మనము దేవుని పని నిమిత్తము వాడబడుటకు ఏర్పరచబడి యున్నాము. వాస్తవముగా, మనము యేసు మన స్వంత రక్షకుడుగా అంగీకరించిన మరు క్షణమే మనము పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధ పరచబడి దేవుడిచ్చిన ఉద్దేశ్యం నిమిత్తమును జీవించుటకు ఏర్పరచబడి యున్నాము. మనము మన ఉద్దేశ్యమును నెరవేర్చకుండా ఉన్నట్లయితే, లేక మన ఉద్దేశ్యమును పూర్తీ చేయకుండా ఉన్నట్లయితే మనము ఖాళీగా మార్చబడి విసుగుదల కలిగి యుంటాము.
మీ పరిశుద్ధత యొక్క ఉద్దేశ్యమును పొందుకొనుమని మిమ్మును ప్రాధేయపడుతున్నాను. సవాలుతో కూడిన నిర్ణయాలను ఎదుర్కొన్నప్పుడు, ఏమి చేయాలో దేవునిని అడగండి మరియు మీకోరకు దేవుడు ఏర్పరచిన పరిశుద్ధ మార్గమును ఎన్నుకొని దానితో ఏమి చేయవలెనో దేవునిని అడగండి.
ప్రారంభ ప్రార్థన
యేసూ, పరిశుద్ధతయనే జీవితము నుండి నన్ను బయటికి లాగుతున్న దేనినైనా గుర్తించుటకు నాకు సహాయం చేయండి. మీ నడిపింపుతో, మీరు నా కొరకు కలిగియున్న పరిశుద్ధ మార్గమును అనుసరించుటకు నేను జాగ్రత్తగా జీవించాలని ఆశించుచున్నాను.