గాడాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై యుందువు; నీ దుడ్డు కర్రయు (భద్రతా) నీ దండమును నన్ను (నడిపించును) ఆదరించును. – కీర్తనలు 23:4
మనకు అవసరమైన లేక ప్రాముఖ్యమైన విషయాలలో దేవుని యందు నమ్మిక యుంచవలెనని మనము కొన్నిసార్లు ఆలోచిస్తాము, కానీ దేవునియందు నమ్మిక యుంచుట యనే నిజమైన సంబంధము ఏదో ఒకటి సమీపించుటకు అయన యందు నమ్మిక యుంచుట కంటే అధికమైనది. మనము ఆశించిన విషయాలను పొందుకునే ప్రక్రియ ద్వారా ఆయన యందు నమ్మిక యుంచుటను మనము నేర్చుకోవలసి యున్నది.
“దేవా నాకు ఇది కావాలి” “నాకు అది కావాలి, ఇది కావాలి” అని అడుగుటలో ఉద్దేశ్యపూర్వకముగా దేవుని మీద నమ్మిక యుంచిన సమయం నా జీవితములో కలిగినప్పుడు, నేను వాటన్నిటిని పొందుకొనుట యనునది నా జీవితములో అతి ప్రాముఖ్యమైనది కాదని అయన చూపించుట మొదలు పెట్టాడు.
పరిస్థితుల గుండా వెళ్ళేటప్పుడు స్థిరమైన పద్దతిలో స్థిరత్వము మరియు మంచి వైఖరితో ఆయనను ఎలా నమ్మాలనే విషయమును గురించి అయన నాకు బోధించాలని ఆశిస్తున్నాడు. మన పరిస్థితులలో అయన మనలను ఎల్లప్పుడూ విడిపిస్తాడని కాక అయన ఎల్లప్పుడూ మనతోనే ఉండి మనతో నడుస్తాడనే సత్యమును నేర్చుకోనవలేనని ఆశిస్తున్నాడు.
దేవుడు ఎల్లప్పుడూ మనకు అవసరమైనప్పుడు మనలను విడిపించడు కానీ అయన ఎల్లప్పుడూ మనతోనే ఉంటాడు. ఈరోజు, మేము కేవలం ముగింపు ఫలితము మీద దృష్టిని ఉంచకుండా ఇప్పుడు కుడా దేవుడు మీతోనే ఉన్నాడని నమ్మండి. ఆయన మీకు సమీపముగా ఉన్నాడు, కాబట్టి ప్రక్రియలో అయన మీతో నడచునని నమ్మండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, నీవు ఇప్పుడు నాతో ఉన్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను. నాకు వస్తువులను ఇవ్వాలని నేను నీ యందు నమ్మిక యుంచుట లేదు, కానీ నా జీవితములోని అనుదిన పరిస్థితుల ద్వారా నేను నిన్ను నమ్ముతున్నాను.