
నా తలిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును (నన్ను తన బిడ్డ వలె దత్తత తీసుకొనును). —కీర్తనలు 27:10
మనము కలిసే అనేక మంది ప్రజలు లేక మనతో ప్రతిరోజూ మనతో సంప్రదింపులు జరిపే వారికి తాము దేవుని బిడ్డలుగా అపరిమితమైన విలువ గలవారనే గుర్తింపు వారికి ఉండదు. ప్రజలు విలువలేని వారమని మరియు అయోగ్యులని భావించునట్లు దయ్యము బాగుగా పని చేస్తాడు కాని ప్రజలను నిర్మించుట, ప్రోత్సహించుట మరియు క్షేమభివృద్ధి కలిగించుట ద్వారా అతని అబద్ధములను మరియు అతడు వేసే నిందలను ప్రభావమును శూన్యము చేయగలము.
ఈ లోకములో విలువైన బహుమతులలో ఒకటైన ఒక నిజాయితీ గల ఒక అభినందనతో దీనిని చేయుట ఒక మార్గమై యున్నది. ఒక నిజాయితీ గల అభినంద చాలా చిన్న విషయముగా కనపడవచ్చు కానీ దీనిని ఇది అభద్రత భావము కలిగి యుండి వారు ఏమాత్రము విలువ లేని వారని భావన కలిగి యున్న ప్రజలకు చాలా బలమునిస్తుంది.
నేను లక్ష్యములను కలిగి యుండుటను నమ్ముతాను మరియు ఇతరులను ప్రోత్సహించుటలో దేవునితో కలిసి పని చేయుచు మంచి అలవాటులను వృద్ధి చేసుకొనుచుండగా, ప్రతిరోజు కనీసం ముగ్గురిని నేను అభినందించాలని సవాలు చేసుకొని యున్నాను. ఒక బలమైన ప్రోత్సాహకుడుగా ఉండునట్లు మీరు అదే విధముగా చేయుట మీకు సహాయ పడుతుందని నేను సిఫారసు చేస్తున్నాను.
విడిచిపెట్టబడ్డామని భావించేవారిని తన బిడ్డలుగా దత్తత తీసుకుంటాడని బైబిల్ చెప్తుంది. మనము అటువంటి చిన్నారులను కనుగొని వారిని బలపరచుటకు మరియు విలువైనవారని భావించుటకు కష్టపడుము. దేవుడు వారిని ప్రేమిస్తున్నాడని వారు తెలుసు కొనునట్లు చేయుదము.
ప్రారంభ ప్రార్థన
పరిశుద్ధత్మా, దేవుడు వారిని తన స్వంత పిల్లలుగా ప్రేమిస్తున్నాడని ఎరుగని ప్రజలను నాకు చూపించుము. వారి మార్గములలోనికి నన్ను నడిపించుము తద్వారా నేను వారిని ప్రోత్సహించి వారు విలువైన వారని తెలుసుకొనునట్లు చేస్తాను.