
ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము. —కీర్తనలు 118:24
మన సాధారణ, అనుదిన జీవితాల్లో – చాలా చెడ్డ రోజుల్లో కూడా దేవుడు మనల్ని ఆనందమును కలిగియుండాలని ఆశిస్తున్నాడు.
నా జీవితములో ప్రతిరోజూ నేను ఎదుర్కొన్న భయంకరమైన సంఘటనలున్నాయి. నేను నా పరిస్థితులను గురించి ఆలోచించినప్పుడు – నేను మరియు డేవ్ మేము బిల్స్ అన్నీ ఎలా కట్టాలా అని ఆలోచించే వారము మరియు మేము చేయవలసిన సమస్తము జరిగిపోయేవి. కొన్నిసార్లు నేను దిండు కవరును నా తల మీద పెట్టుకొని మంచంలో పడుకొని ఉండాలని అనుకునే దానిని.
నేను చింతలో చుట్టబడి అసలైన ఒక విషయాన్ని కోల్పోయేదానిని : దేవుడు ఒక నూతన దినమును సృష్టించాడు మరియు దానిలో ఆనందించుటకు అయన దానిని సృష్టించాడు.
మన జీవితములోని ప్రతి దినము అనేక రకములైన పరిస్థితులు మిమ్మల్ని నిరాశ పరచవచ్చు – మీ కారు తాళపు చెవిని పోగొట్టుకొనుట, లేక ట్రాఫిక్ లో ఇరుక్కొని పోవుట వంటివి జరగవచ్చు. కానీ మీరు సమాధానముతో ఉండుటకు ఎన్నుకోవచ్చు మరియు వాటి మద్యలో దానిని నిగ్రహించుకోవచ్చు.
మనము మనలో నుండి మరియు మన పరిస్థితులలో నుండి మన మనస్సును కోల్పోయినప్పుడు మరియు దేవుని మీద దృష్టిని ఉంచి ఇతరులను ప్రేమించినప్పుడు, దేవునిని గౌరవించే వైఖరిని మనము హత్తుకొంటున్నాము మరియు దేవుని నుండి ఒక ఉత్తేజకరమైన బహుమానముగా ప్రతిరోజును మనము చూస్తాము.
ప్రారంభ ప్రార్థన
దేవా, నూతన దినమనే బహుమానమును బట్టి మీకు వందనములు. జీవితములోని నిరాశ పరిస్థితుల మీద దృష్టిని ఉంచుట కంటే, మీలో నేను సమాధానముగా ఉండునట్లు మరియు మీలో ఆనందించి సంతోశించునట్లు ఎన్నుకొని యున్నాను.