అయితే నీవు అన్నివిషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. —2 తిమోతి 4:5
ప్రజలు స్వేచ్చగా ఉండుటకు జన్మించారు; అది దేవుని నుండి ఉచితముగా వస్తుంది. ఇక్కడ ప్రశ్న ఎదనగా, మనము స్వేచ్చగా ఉండుటకు దేనిగుండా వెళ్ళాలో దానిని ఎదుర్కొనుటకు సిద్ధంగా ఉన్నావా లేక మీ జీవితాంతం ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండాలని ఆశిస్తున్నారా? మీకు స్వేచ్చ కావాలంటే, దేవుడు మీరు ఏమి చేయాలనుకుంటున్నాడో, ఒక దశలో ఒక అడుగు వేయడం ప్రారంభించడమే మరియు చివరికి మీరు మీ గందరగోళముల నుండి బయటపడతారు.
2 తిమోతి 4:5లో, పౌలు తిమోతితో పరిచర్య చేసేటప్పుడు నీవు అన్నివిషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుమని చెప్పియున్నాడు. అది మనందరికీ అవసరమైన మంచి సలహా.
మనము మన సమస్యల గుండా వెళ్ళేటప్పుడు మన ఉద్రేకముల ద్వారా పరిపాలించబడుట కంటే మనము మితముగా ఉంటూ దేవుడు మనల్ని పిలిచినా పిలుపుకు తగినట్టుగా జీవించుట మంచిది. మీరు ఎదో ఒక విషయమై మనస్తాపం చెందియున్నట్లైతే తద్వారా మీ జీవితాన్ని పాడు చేసుకొనుటకు బదులుగా దానిని మేలు కొరకే మార్చుకొనుట మంచిది. మనలను గాయపరచిన మరియు ద్వేశించిన వారి కొరకు ప్రార్ధించుట ద్వారా చెడును మరియు కోపమును జయించుడి. ఒకరి కొరకు మేలు చేయుట ద్వారా స్వార్ధపరమైన భావాలను పార ద్రోలండి.
శత్రువు ఎప్పుడైనా మీ ఉద్రేకములను కదిలించినప్పుడు, నిశ్శబ్దముగా దేవుడు మిమ్మును పిలిచిన పిలుపు నిమిత్తము పని చేయండి!
ప్రారంభ ప్రార్థన
పరిశుద్ధత్మా, నేను ప్రశాంతముగా, చల్లగా మరియు స్థిరముగా ఉండుటకు నాకు సహాయం చేయుము, తద్వారా నేను నా జీవితములో ఆనందించుటకు మరియు మీరు నన్ను పిలిచిన పిలుపుకు తగిన కార్యము చేయుటకు నేను స్వేచ్ఛను పొందుకుంటాను.