ఆయన వేదనపడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట, నేల పడుచున్న గొప్ప రక్త బిందువులవలె ఆయెను. (లూకా 22:44)
యేసు సిలువ వేయబడే సమయం ఆసన్నమైనప్పుడు, ఆయన తన మనస్సులో మరియు భావోద్వేగాలలో గొప్ప పోరాటాన్ని అనుభవించాడు. కొన్ని సమయాల్లో మనలాగే దేవుని చిత్తానికి అనుగుణంగా వెళ్లడానికి ఆయనకు దేవుని బలం అవసరం. ప్రార్థన చేసి ఆ బలాన్ని పొందాడు. ఆయన ప్రార్థించగా దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్యలు చేశారని బైబిల్ చెబుతోంది.
దేవుడు మిమ్మల్ని అడుగుతున్నది చాలా కష్టం అని ఎప్పుడూ అనుకోకండి. మీరు దేవుని చిత్తాన్ని చేయడానికి సిద్ధంగా ఉంటే మరియు మిమ్మల్ని బలపరచమని మీరు దేవుణ్ణి అడిగితే, ఆయన చేస్తాడు. మీ పని ఎంత అసాధ్యమో దేవునికి మరియు ఇతరులకు చెప్పే మాటలు వృధా చేయకండి. మీకు ధైర్యాన్ని, దృఢనిశ్చయం మరియు బలాన్ని ఇవ్వమని దేవుడిని కోరుతూ అదే శక్తిని ఉపయోగించండి. దేవుడు ఒక వ్యక్తితో భాగస్వామ్యమును కలిగియుండి, అసాధ్యమైన పనులను చేయగలిగేలా అతనిని లేదా ఆమెను సిద్ధ పరచినప్పుడు సాక్ష్యమివ్వడం చాలా ప్రాముఖయమైన విషయం అని నేను భావిస్తున్నాను.
మనిషికి స్వతహాగా చాలా విషయాలు అసాధ్యం, కానీ దేవునికి అన్నీ సాధ్యమే. బహుశా మీరు ప్రస్తుతం సంక్షోభాన్ని లేదా కష్టాన్ని ఎదుర్కొంటున్నారు; మీరు అయితే, యేసు గెథ్సెమానే తోటలో చేసిన పోరాటాన్ని గుర్తుంచుకోవాలని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఆయన తన చెమట రక్తంగా మారేంత ఒత్తిడిని అనుభవించాడు. దేవుని బలం ద్వారా ఆయన చేసిన పనిని ఖచ్చితంగా చేయగలిగితే, మీరు ప్రార్థన ద్వారా కూడా విజయం పొందవచ్చు.
ఈరోజు మీ కొరకు దేవుని మాట: మీ పక్షాన ఉన్న మీ సామర్థ్యానికి మించిన పనిని దేవుడు మీకు ఎప్పుడూ ఇవ్వడు.