బయటికి వెళ్ళండి మరియు కనుగొనండి

బయటికి వెళ్ళండి మరియు కనుగొనండి

ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును యెహోవా వాని నడతను స్థిరపరచును. – సామెతలు 16:9

ప్రజలు కొన్నిసార్లు నన్ను వారి జీవితములలో దేవుని చిత్తమును ఎలా కనుగొనాలని నన్ను అడుగుతారు. కొంతమంది అనేక సంవత్సరాలు స్వరమును వినుటకు లేక అసాధారణ ప్రత్యక్షతను పొందుకొనుటకు వేచియుంటారు. కానీ మీ హృదయములో దేవుని స్వరమును వినుట సాధారణముగా దాని కంటే ఎక్కువ అనుభవముతో కూడినదై యున్నది. నేను వారితో బయటికి వెళ్లి కనుగొనమని చెప్తాను.

దేవునితో నా ప్రయాణపు ప్రారంభములో, నేను ఆయనను సేవించాలని ఆశించి యున్నాను. ఆయన నా జీవితములో ఒక పిలుపు ఉంచి యున్నాడని నేను భావించాను కానీ నేనేమి చేయాలో నాకు తెలియదు, కాబట్టి నాకు అందుబాటులో ఉన్న విభిన్న అవకాశములను ప్రయత్నించి యున్నాను.

అందులో అనేకమైనవి నాకు పని చేయలేదు, కానీ నాకు సరిపోయే అవకాశము లభించేంత వరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను. నాకు ప్రజలతో వాక్యము పంచుకొనుటకు అవకాశము లభించినప్పుడు నేను చివరకు నా అంతరంగములో జీవించుట ప్రారంభించాను. నేను బోధనలో ఆనందమును కనుగొన్నాను మరియు దానిని చేయుటకు నాకు దేవుడు సామర్ధ్యమును ఇచ్చియున్నాడు. నాకు పరిచర్యలో స్థానమున్నదని నేను కనుగొనినట్లు నాకు తెలుసు.

కొన్నిసార్లు నేను పిలిచే “బయటికి వెళ్ళుట మరియు కనుగొనుట” అను దానిని అభ్యాసం చేయుటయే దేవుని చిత్తమును కనుగొనుటకు ఒకే మార్గమై యున్నది. ఒకవేళ మీరేదైనా పరిస్థితిని గురించి మీరు ప్రార్ధించి ఏమి చేయాలో మీకు తెలియనప్పుడు విశ్వాసపు అడుగు తీసుకోండి. తప్పు చేస్తామని భయపడవద్దు. బయటికి వెళ్ళండి దేవుడు మిమ్మును నడిపిస్తాడు.


ప్రారంభ ప్రార్థన

దేవా, నేను నీయందు నమ్మిక ఉంచుచున్నాను మరియు మీరు నా నడతలు స్థిరపరుస్తారని నాకు తెలుసు, కాబట్టి నేను బయటకు వెళ్లి మీరు నా కొరకు కలిగియున్నదానిని కనుగొనుటకు భయపడను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon