బలముగా నాటిన మొక్కవలె స్థిరముగా ఉండుట

బలముగా నాటిన మొక్కవలె స్థిరముగా ఉండుట

అతడు నీటికాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును (పరిపక్వ దశకు వచ్చును). —కీర్తనలు 1:3

స్థిరత్వము అనునది మనందరికీ అవసరమై యున్నది. యిర్మీయా 17:8 మరియు కీర్తనలు 1:3 రెండునూ, బలముగా నాటబడిన చెట్ల వలె ఉండాలని మనకు చెప్పబడి యున్నది. 1 పేతురు 5:8 మనకు చెప్పున దేమనగా సాతానుడు మనలను మ్రింగవలెనని చూచుచుండగా మనము సమతుల్యతతోను మరియు నిగ్రహముతోను ఉండాలని మనకు చెప్పబడి యున్నది. అతనిని ఎదిరించుటకు మనము క్రీస్తులో బలముగా నాటబడి, స్థిరపరచబడి బలముగా కదలకుండా ఉండాలి.

మనము బలముగా వేరుతన్ని ఫలించాలంటే యేసే మంచి నేలగా ఉన్నాడు. మీరు స్థిరంగా ఉండటానికి ఆయనపై ఆధారపడవచ్చు-ఆ యేసే, ఎల్లప్పుడూ నమ్మకమైనవాడు, స్థిరమైన వాడు, ఆయన వాక్యానికి సత్యవంతుడు మరియు పరిపక్వత చెందినవాడు. ఆయన ఒకసారి ఒక మార్గం కాదు మరియు మరోసారి మరొక మార్గంలో ఉండడు. ఆయన పరిస్థితులతో మారడు, కాబట్టి మీరు ఆయనలో పాతుకుపోయినట్లయితే, మీరు కూడా మారరు.

ప్రతికూల పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండటానికి దేవుడు మనకు శక్తిని ఇవ్వాలనుకుంటున్నాడు. బలముగా నాటబడిన చెట్ల వలె మనం స్థిరంగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు, కాని మనం ఎక్కడ నాటబడవలెనో ఎంచుకోవాలి. మీరు ప్రపంచంలో పాతుకుపోతారా? మీ భావోద్వేగాలలో? మీ పరిస్థితులలో? మీ గతం? లేదా క్రీస్తులో మీరు నాటబడుటకు మీరు ఈ రోజు ఎన్నుకుంటారా? ఆయనపై ఆధారపడాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అతని స్థిరత్వం ఈ రోజు మీదే కావచ్చు.


ప్రారంభ ప్రార్థన

దేవా, నేను నీలో వేరుతన్ని స్థిరముగా ఉండాలని ఆశిస్తున్నాను. మీరు మార్పులేని వాడవు కాబట్టి నేను కుడా ప్రతి పరిస్థితిలో స్థిరముగా ఉండాలని ఆశిస్తున్నాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon