
యెహోవా, నీవు శిక్షించువాడు నీ ధర్మశాస్త్రమును బట్టి నీవు బోధించువాడు ధన్యుడు (సంతోషముగలవాడు, అదృష్ట వంతుడు). భక్తిహీనులకు గుంట త్రవ్వబడువరకు నీతిమంతుల కష్టదినములను పోగొట్టి వారికి నెమ్మది కలుగజేయుదువు. —కీర్తనలు 94:12-13
మన జీవితము లేక ప్రజలు మనలను నిరుత్సాహపరచిన యెడల, మన జీవితాల్లో దేవుడు కలిగియున్న ఉద్దేశ్యముతో స్థిరముగా నిలిచి యుండే బాధ్యతను మనము కలిగి యున్నాము.
కీర్తనలు 94:12-13లో గమనించండి. దేవుడు మనలను నెమ్మదిగా ఉంచునని చెప్పడం లేదని గ్రహించండి. మనల్ని మనము నెమ్మదిగా ఉంచునట్లు దేవుడు మనకు శక్తిని అనుగ్రహిస్తాడని చెప్తుంది. మనము దేవునితో పాలిభాగస్థులము. ఆయన బాధ్యత ఎదనగా మనకు సామర్ధ్యమును అనుగ్రహించుట మరియు మన బాధ్యత ఎదనగా ఆ సామర్ధ్యమును అభ్యసించి బాధ్యత కలిగి యుండుట.
బాధ్యత అనగా మనము కలిగియున్న సామర్ధ్యమునకు స్పందించుట. ఒక బాధ్యత లేని వ్యక్తి దేవుడే సమస్తము చేయవలెనని ఆశిస్తాడు మరియు అతడు ఏమీ చేయకుండా తన భావనలను అనుసరిస్తూ ఉంటాడు. కానీ మీ భావనలను పని చేయునట్లు అనుమతించవద్దు. ఇప్పుడే దేవుని వద్ద ఇలా ప్రకటించండి, “నేను నా చివరి చిన్న పార్టీకి హాజరయ్యాను.” మీరు ముగింపులో మీరు బాధ్యతను విస్మరించకుండా దానిని నెరవేర్చినట్లైతే మీరు మంచి భావనను కలిగి యుంటారని నేను వాగ్దానం చేస్తున్నాను.
దేవుడు మీ గురించి శ్రద్ధ కలిగి యున్నాడు, కానీ అయన మీరు చేయవలసిన దానిని చేయడు. మీరు దానిని చేయునట్లు మీకు సహాయపడును, కానీ అయన మీ కొరకు దానిని చేయడని నొక్కి పలుకుచున్నాను! మీరు స్థిరముగా నిలబడవలెనని, బాధ్యత వహించి దేవుడు మీకొరకు ప్రణాళిక కలిగి యున్న ఆశీర్వదకరమైన జీవితాన్ని జీవించుటకు పని చేయుట ప్రారంభించండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను నెమ్మదిగా ఉండుటకు మీరు నాకు సామర్ధ్యమును అనుగ్రహిస్తారని మీ వాక్యము సెలవిస్తుంది. నేను దానిని ఇప్పుడే పొందుకొంటున్నాను. నా భావనలు నా జీవితాన్ని నడిపించుటకు అనుమతించను మరియు నేను వెళ్ళుటకు మీరు కోరుకొనిన మార్గమును వెళ్లునట్లు నేను బాధ్యత వహించి స్పందిస్తాను.