భయపడకుడి మరియు పరిశుద్ధాత్ముని అనుసరించుడి

భయపడకుడి మరియు పరిశుద్ధాత్ముని అనుసరించుడి

నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక యేర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పియున్నాను నీకు తోడైయున్నాను భయపడకుము నేను నీ దేవుడనై యున్నాను దిగులుపడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణహస్తముతో నిన్ను ఆదుకొందును.…. —యెషయా 41:10

పరిశుద్ధాత్మలో ధైర్యంగా, భయము లేకుండా ఉండటానికి ఈ లేఖనం గొప్ప ప్రోత్సాహమును కలిగిస్తుంది. మనము ఖచ్చితంగా దేవుని చిత్తానికి లేదా ఆయన సమయానిని మించి ఏమీ చేయకూడదనుకుంటున్నాము, కాని దేవుడు కదులుతున్నప్పుడు, ఆయనతో కదలడానికి మనము భయపడలేము. పరిశుద్ధాత్మ మనలను కొత్త దిశలో నడిపించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సాతాను మన మనసుకు, భావోద్వేగాలకు భయాన్ని తెస్తాడు. మనము దేవునితో ముందుకు సాగకుండా ఉండటానికి భయాన్ని ఉపయోగించటానికి ప్రయత్నిస్తాడు.

యెషయా 41:10 ఇలా చెప్తుంది, భయపడకుము (మీరు భయపడవలసిన అవసరం లేదు), నేను మీతో ఉన్నాను. మీరు దేనికైనా భయపడుచు దాని నుండి విడిపించబడాలని కోరుకుంటే, చివరికి మీరు మీ భయాన్ని ఎదుర్కోవలసి వస్తుంది మరియు దాని నుండి పరుగెత్తకూడదు. యేసు హస్తాన్ని తీసుకోండి, ఆయన మీతో ఉన్నాడని గుర్తించి, దీన్ని చేయండి. భయపడవద్దు, ఎందుకంటే ఆయన మీతో ఉన్నాడు.

మీరు మీ జీవితంలో ఈ కూడలిలో ఉంటే, ముందుకు వెళ్ళమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. భయ భీతితో నిలబడకండి, కానీ ఆయన చేతిని తీసుకొని ముందుకు సాగండి. గుర్తుంచుకోండి, మీ భయాలన్నిటి నుండి దేవుడు మిమ్మల్ని విడిపించాలని కోరుకుంటున్నాడు!


ప్రారంభ ప్రార్థన

ప్రభువా, మీరు నన్ను నడిపించిన చోటికల్లా నేను నిన్ను అనుసరింతును. నేను నీతో పాటుగా ముందుకు సాగునట్లు నేను ధైర్యముగా మరియు భయపడకుండునట్లు నాకు సహాయం చేయుము.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon