యెహోవా నాకు వెలుగును రక్షణయునైయున్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతును? —కీర్తనలు 27:1
మీ ఆలోచనలు భయముతో పట్టబడి యున్నట్లైతే దేవుడిచ్చిన గమ్యమును చేరుట అసాధ్యము. పిరికితనము అనునది భయమునకు సన్నిహిత బంధువు మరియు దానిని మీరు మీ మనస్సులోనికి అనుమతించినట్లైతే అది మిమ్మల్ని నిరాశ లోనికి నడిపించి మీ ఆనందమును దొంగిలిస్తుంది.
మేము భారత దేశములో ఒక సదస్సు నిర్వహించాలని ప్రణాళిక కలిగి యున్నప్పుడు నేను భయమనే భావనను అనుభవించి యున్నాను. అక్కడ లభించిన అద్భుతమైన అవకాశమును బట్టి నేను చాల ఆనందించాను కానీ నేను అక్కడ ఎక్కువ సమయం విమానంలో ఉండటం మరియు ఆ దేశములో ఉన్న అననుకూల పరిస్థితులను బట్టి చాలా నిరాశ చెంది యున్నాను. కానీ దేవుడు నా హృదయముతో మాట్లాడి నేను పిరికి తనమును జయించాలంటే ఆయన వాక్యములో నిలిచి యుండాలని నాతో మాట్లాడి యున్నాడు. నేను ఆ ప్రయాణములోని వ్యతిరేక పరిస్థితులను గురించి ఆలోచించుటకు నన్ను నేను అనుమతించినట్లైతే దేవుడు నేను అనుభవించాలని ఆశించిన ఆనందమును మరియు ఉత్తేజమును తొలగించి ఉండేది.
పిరికితనమనేది ఒక వల మరియు మీరు అందులో పట్టబడకూడదని మీరు నిర్ణయించుకొనవలెను. భయమును కలిగించే క్రియలు జరుగుతున్నప్పుడు లేక మీ హృదయములలో భయము కలిగినప్పుడు, మీ భవిష్యత్తును గురించి నిశ్చయత లేనప్పుడు లేక నూతన పరిస్థితులు లేక సవాళ్ళను ఎదుర్కొంటున్నప్పుడు కీర్తనలు 27:1 లో చెప్పబడినట్లుగా “యెహోవా నాకు వెలుగును రక్షణయై యున్నాడు – నేనెవరికి వెరతును?” అని ఎలుగెత్తి ప్రార్ధించి ఒప్పుకొనండి.
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, ఈరోజు మీరు నాకు వెలుగు మరియు రక్షణయై యున్నారని నేను ప్రకటిస్తున్నాను. మీ ద్వారానే, నా జీవితములో నేను దేనిని గురించి భయపడను. మీలో నాకు విజయం కలదు.