భయమునకు మీరు మోకరిల్లవద్దు

భయమునకు మీరు మోకరిల్లవద్దు

నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను.  —కీర్తనలు 56:3

భయము అనునది దేవుని వద్ద నుండి రాదు, కానీ సాతాను నుండి వస్తుంది, కాబట్టి, మీ జీవితములో మీరు భయపడిన ప్రతిసారి శత్రువు మీకు వ్యతిరేకముగా వస్తున్నాడు. నేను తరచుగా నా బోధనలలో భయము అనునది “యజమాని ఆత్మ” అని చెప్తూ ఉంటాను. అది దేవుని ప్రజలను ఏలుటకు మరియు వారిని యేసు క్రీస్తు అనే నిజమైన యజమానుని నాయకత్వము క్రిందికి రాకుండా ఆపుటకు సాతానుడు ఉపయోగించే ఆత్మ.

జన సమూహము ఎన్నడూ వారి జీవితములో దేవుని పిలుపును నెరవేర్చుటకు ప్రయత్నించరు ఎందుకనగా వారెప్పుడైనా ముందుకు వెళ్ళాలని ప్రయత్నించినప్పుడు సాతానుడు భయమును ఉపయోగించి వారిని ఆపుటకు ప్రయత్నిస్తాడు.  మిమ్మల్ని ఆపుటకు అతడు భయమును ఉపయోగిస్తున్నాడా?  సాతానుడు భయమును ఉపయోగించి ప్రజల జీవితములో ఆనందించకుండా ఆపుతాడు.  భయము వేదనను కలిగించును మరియు మీరు ఖచ్చితముగా మీ జీవితములో ఆనందించలేరు మరియు అదే సమయంలో మీరు భయపడతారు.

దయ్యము భయమును కలిగించినప్పుడు, మీరు దానికి మోకరిల్లనవసరం లేదు. దావీదు చెప్పాడు, “నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను”. శత్రువు మిమ్మల్ని దాడి చేసినప్పుడు మీరు మీ ప్రయత్నములతో దేవునిని హృదయ పూర్వకముగా వెదకి ఆయనను అనుసరించినట్లైతే అది మీకు అభయమని నేను నమ్ముతున్నాను.  ఏది ఏమైనప్పటికీ మీరు మీ విశ్వాసమును మరియు నమ్మకమును దేవునిలో ఉంచినట్లైతే మీ భయమును జయించుటకు మరియు ముదుకు సాగుటకు ఆయన మీకు సహాయపడును.


ప్రారంభ ప్రార్థన

దేవా, నేను భయముతో సాగిలపడవలసిన అవసరం లేదు. నేను నా విశ్వాసమును మరియు నమ్మకమును మీలోనే ఉంచి యున్నాను. నేను భయమును ఎదిరించుటకు అవసరమైన ధైర్యము మరియు బలమును ఇచ్చుటకు నేను నీ మీద ఆధారపడగలను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon