మంచి దేవుడు చెడు విషయాలు జరుగుటకు ఎందుకు అనుమతిస్తున్నాడు?

మంచి దేవుడు చెడు విషయాలు జరుగుటకు ఎందుకు అనుమతిస్తున్నాడు?

(ఉచితమైన, ఉన్నతమైన, సంపూర్ణమైన) శ్రేష్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును; ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు.  —యాకోబు 1:17

మనము భయంకరమైన అపాయమును అనుభవించినట్లైతే, దేవుని మీద కోపం కలిగి యుండుట ఒక సాధారణ స్పందన. ప్రజలు తరచుగా “ఒకవేళ దేవుడు మంచివాడు, సర్వశక్తిమంతుడు, మరియు మన యెడల పూర్ణమైన ప్రేమ కలిగి యున్నయెడల నాకు కలిగిన ఈ బాధను ఎందుకు ఆపలేదు? అని అడుగుతూ ఉంటాము.”

ఇక్కడే సాతాను దేవునికి మరియు గాయపరచబడిన ప్రజల మధ్య ఒక గోడ కడతాడు. “దేవుడు మంచివాడు కాదు మరియు ఆయనను మనము నమ్మలేము” అని పలుకుటకు ఒక అవకాశము కొరకు వెదకుతాడు. ఏది ఏమైనా దేవుని వాక్య ప్రకారము సాతానుడు సత్యము కాదు – అతడు అబద్ధీకుడు మరియు అబద్ధాములకు జనకుడు.

యాకోబు 1:17 చదవండి. శ్రేష్ఠమైన ప్రతి మంచి ఈవియు దేవుని నుండే వచ్చును. దేవుడు మంచివాడు మరియు అతడు మరొకటి కాదు. ఇంకా చెప్పాలంటే ఆయన మార్పు లేని వాడు. ఆయన పూర్తిగా స్థిరమైన, నమ్మకమైన మరియు మార్పులేని వాడు. ఆయన అన్ని వేళలా – మంచి వాడు.

దేవుడు ఎల్లప్పుడూ అపాయమును ఆపడని తెలుసు మరియు చెడు విషయాలు ఎందుకు జరుగుతాయో మనకు నిజముగా తెలియదు. 1 కొరింథీ 13:12 ఇలా చెప్తుంది, … ఇప్పుడు కొంతమట్టుకే (అసంపూర్ణముగా) యెరిగియున్నాను; విశ్వాసము ఎల్లప్పుడూ జవాబు లేని ప్రశ్నలనే కోరుకుంటుందని మనం ఎల్లప్పుడూ జ్ఞాపకముంచుకోవాలి మరియు సమస్తము ఎరిగిన వానిని గురించి తెలుసుకొనుటలో మనము పూర్తిగా సంతృప్తిని కలిగియుండాలి మరియు ఆయన యందు నమ్మికయుంచే స్థలములో మనము ఉండాలి.


ప్రారంభ ప్రార్థన

దేవా, చెడు విషయాలు ఎందుకు జరుగుతాయో నాకు అన్ని సార్లు అర్ధం కాదు కానీ నీవు మంచివాడవని నాకు తెలుసు. ఎందుకో నాకు అర్ధం కానప్పుడు, నీలో నా ఆదరణను నేను పొందుకుంటాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon