…మీరు మీ దేవుడైన యెహోవా నిబంధన మందసమును యాజకులైన లేవీయులు మోసికొని పోవుట చూచునప్పుడు మీరున్న స్థలములో నుండి బయలుదేరి దాని వెంబడి వెళ్లవలెను. —యెహోషువ 3:3
మీరు ఇప్పుడు ఏవైనా నూతన అవకాశములను ఎదుర్కొంటున్నారా? ఆ అవకాశములు ఏవైనా కావచ్చు కానీ ఎల్లప్పుడూ మందసమును అనుసరించుట చాలా ప్రాముఖ్యమైనది. దానిని గురించిన అర్ధమేమిటి? మంచిది… కొన్నిసార్లు మనము మన జీవితాల్లో పాత విషయాలను పట్టుకొని వ్రేలాడుతూ ఉంటాము ఎందుకంటే అవి మనకు బాగుగా మన హృదయాల్లో హత్తుకొని వున్నాయి మరియు మనము భయముతో కూడిన ఆ విషయాలు మరలా మన జీవితాల్లో తిరిగి జరుగుతాఏమోననే భయంతో ఉంటాము. ఆ తరువాత మన ముందు ఒక నూతనమైనది జరుగబోతుందని మరియు అందులోనికి మనము అడుగు పెట్టబోతున్నామని అనుకుంటాము – దానిని మనము దేవుని సమయం కంటే ముందు చేయటానికి ప్రయత్నిస్తాము.
యెహోషువా 3:3లో దేవుడు ఇశ్రాయేలీయులతో నిబంధన మందసమును గురించి మాట్లాడియున్నాడు. మందసము దేవుని అభిషేకము… దేవుని సన్నిధి… దేవుని చిత్తమునకు గుర్తుగా ఉన్నది. మనము మన చిత్తమును మరియు ఇతరుల చిత్తమును కాకుండా దేవుని చిత్తమును అనుసరించుట చాల ప్రాముఖ్యమైనది.
దేవుడు మీ యెడల మరియు నా యెడల ఒక ప్రణాళికను కలిగి యున్నాడు మరియు ఆ ప్రణాళిక నేరవేర్చబడుట చూచుటకు ఒకే ఒక మార్గము ఏదనగా మందసమును లేక దేవుని చిత్తమును అనుసరించుటయే కానీ శరీరమును లేక ఇతర ప్రజలను లేక మన ఉద్రేకమును అనుసరించుట కాదు.
జ్ఞాపకముంచుకోండి, ఈరోజు మీ జీవితములో దేవుని చిత్తము ఏదైనను దానిని నేరవేర్చుటకు దేవుడు మార్గమును సిద్ధ పరచును.
ప్రారంభ ప్రార్థన
దేవా, ఇశ్రాయేలీయుల వలె నేను మందసమును అనుసరించవలెనని నాకు తెలుసు. నూతన అవకాశాములకు నేను కలిగియున్న సమయముతో సంబందము లేదు… కేవలం నీ చిత్తమే ప్రాముఖ్యమైనది. నేను నిన్ను అనుసరిస్తుండగా, నీ చిత్తము నా జీవితములో నెరవేర్చబడునట్లు మీరు ఒక మార్గమును ఏర్పరచగలరని నేను ఎరిగి యున్నాను.