మనమందరమూ మంచి పోరాటమును పోరాడుతున్నాము

మనమందరమూ మంచి పోరాటమును పోరాడుతున్నాము

నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుందును నదులలో బడి వెళ్లునప్పుడు అవి నీమీద పొర్లిపారవు. నీవు అగ్నిమధ్యను నడచునప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. —యెషయా 43:2

మనం తరచుగా ఎదుర్కొనే అబద్ధాలలో ఒకటి ఏదనగా, మనమందరం ఒంటరిగా,సాతానుతో పోరాటం చేయడం. సాతాను మనల్ని ఒంటరిగా చేసి మనము ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నామో అటువంటి వాటి గుండా ఎవరూ వెళ్ళుట లేదని ఆలోచించునట్లు చేస్తాడు.

సత్యమేదనగా, మనమందరం పోరాడుతున్నాం. మీరు ఒక్కరు మాత్రమే అలసిపోరు. మీరు ఒక్కరు మాత్రమే సాతాను యొక్క అబద్ధాలను ఎదిరించుటలో మరియు మీ భావాలను ఎదిరించుటలో అలసిపోవడం లేదు.

మీలాగే నేను కూడా విశ్వాసం యొక్క మంచి పోరాటం పోరాడాలి. మరియు శత్రువులకు వ్యతిరేకంగా మీతో పాటు లెక్కలేనంత మంది ఇతర విశ్వాసులు కూడా ఉన్నారు. అన్నింటికన్నా ఉత్తమమైనది, దేవుడు మీతో అడుగడుగునా ఉన్నాడు. యెషయా 43:2 లో ఇవ్వబడిన వాగ్దానం ఎదనగా, మనమందరమూ శోధనలలో గుండా వెళ్తున్నప్పుడు దేవుడు మనతోనే ఉంటాడు. మనము జలములలో బడి వెళ్ళినప్పుడు, అవి మన మీద పొర్లిపారవు, మనము మునిగిపోము, మరియు మనము అగ్ని గుండా వెళ్ళినప్పుడు మనం కాలిపోము, ఎందుకంటే ఆయన మనతో ఉన్నాడు.

కాబట్టి ప్రోత్సహించబడండి. మీరు ఎదుర్కొనే ప్రతి యుద్ధములో దేవుడు మనకు బలమును మరియు జ్ఞానమును అనుగ్రహించును.


ప్రారంభ ప్రార్థన

దేవా, మీరు నాతో ఉన్నందుకు మరియు మీ అనుచరులందరూ శత్రువుకు వ్యతిరేకముగా పోరాడుతున్నందుకు వందనములు. నేను ఒంటరిని అనే అబద్ధమును నేను నమ్మను. మీరు నాతో ఉండుటలో మరియు నాకు మీరు అవసరమైనప్పుడు నాకు సహాయం చేయుటలో మీరు నమ్మకత్వము గలవాడవు.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon