మనము అడగాలి

మనము అడగాలి

అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడుగవలెను; (సందేహం లేకుండా, అనుమానం లేకుండా). (యాకోబు 1:6)

మనం కొత్త నిబంధనలోని యాకోబు పత్రికను చదివితే, జీవిత సమస్యలను మరియు పరీక్షలను ఎలా నిర్వహించాలో చెప్పడం ద్వారా యాకోబు తెలియ జేయడం చూస్తాము. ఈ విషయాలతో వ్యవహరించడానికి సహజమైన మార్గం ఉంది, కానీ వాటిని నిర్వహించడానికి ఆత్మీయ మార్గం కూడా ఉంది.

యాకోబు 1:5–6లో, యాకోబు ప్రాథమికంగా ఇలా అంటాడు, “మీకు ఇబ్బంది ఉంటే, మీరు ఏమి చేయాలో దేవున్ని అడగండి.” మీరు ఆయన స్వరాన్ని వినలేరు మరియు వెంటనే సమాధానాన్ని పొందలేరు, కానీ మీరు విశ్వాసంతో అడిగినట్లయితే, మీరు మీ వ్యాపారంలో కొనసాగుతున్నప్పుడు దైవికమైన మరియు మీ సహజ జ్ఞానానికి మించిన జ్ఞానాన్ని మీరు కనుగొంటారు.

కీర్తనలు 23:2లో, దేవుడు తన ప్రజలను పచ్చిక గల చోట్ల నడిపిస్తాడు మరియు శాంతి కరమైన జలముల యొద్దకు నడిపిస్తాడని కీర్తనకారుడు చెప్పాడు. మరో మాటలో చెప్పాలంటే, మనం ఆయనను వెదకితే దేవుడు ఎల్లప్పుడూ మనల్ని శాంతికరమైన ప్రదేశానికి నడిపిస్తాడు.

నేటి వచనాన్ని మరలా తిరిగి చూడండి మరియు మనం విశ్వాసంతో అడగాలని గమనించండి. చాలా తరచుగా మనకు సహాయం అందదు, ఎందుకంటే మనం దానిని అడగడం లేదు. పరిశుద్ధాత్మ ఒక గౌరవం గల వ్యక్తి. మన పరిస్థితుల్లోకి ఆయనను ఆహ్వానించే వరకు ఆయన వేచి ఉంటాడు. మనము ఊహించలేము మరియు ముందుగానే ఎదురుచూడలేము; మనం అడగాలి!


ఈరోజు మీ కొరకు దేవుని మాట: మీకు ఏదైనా అవసరమైనప్పుడు, దాని కొరకు దేవునిని అడగండి.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon