ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొనజూచుచున్నానా దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుష్యులను సంతోషపెట్టగోరుచున్నానా? నేనిప్పటికిని మనుష్యులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు (మెస్సీయా) దాసుడను కాకయేపోవుదును. —గలతీ 1:10
మీరు దేవుడు ఏ ఉద్దేశ్యము చేత మిమ్మును సృష్టించియున్నాడో అలాగే ఉన్నారా లేక మనుష్యులను సంతోష పెట్టువారుగా ఉన్నారా? ఈ లేఖనము ప్రకారము దేవునిని సంతోషపెట్టుట మరియు మనము ఎలా ఉండాలని ఆయన ఆశిస్తున్నాడో అలాగే ఉండుటయే దేవుని చిత్తము.
దేవుడు మిమ్మును ఎలా ఉండాలని సృష్తించి యున్నాడో అలాగే ఉండుటకు మీరు ఎన్నుకొనిన యెడల – అనగా ప్రత్యేకించబడి ఇతరుల కంటే విభిన్నముగా ఉండుటకు – మీరు కొంత విమర్శలు ఎదుర్కొనవలసి ఉంటుంది. దీనితో వ్యవహరించుట ఎల్లప్పుడూ సులభము కాదు, కానీ మీరు మీ స్వంత నమ్మకాలకు వ్యతిరేకముగా వెళ్తే మిమ్మల్ని మీరు ఇష్టపడరు.
చూడండి, మీరు జనముతో కలిసి వెళ్తుంటే, దేవుడు మిమ్మల్ని వేరే మార్గములో నడిపిస్తున్నట్లు మీ హృదయములో భావించుట అనునది ప్రజలు తమతో తాము ఉండుట వలన విజయం పొందలేరనుటకు ఒక కారణమైయున్నది.
మీరు ఒక అడుగు బయటకు వేసి దేవుడు మీరెలా ఉండాలని ఆశించి యున్నాడో అలాగే ఉండుటకు మీరు సిద్ధపడండి. ఇతరులు మీతో వ్యవహరించే విధానము లేక మీతో స్పందించే విధానముతో మీ యోగ్యతను నిర్ణయించవద్దు. మీరు విమర్శను ఎదుర్కొనుటకు మరియు దానితో వ్యవహరించుటకు మీరు ధైర్యమును కలిగి యుండండి.
దేవుడు మిమ్మును అంగీకరిస్తాడని మరియు ప్రేమిస్తున్నాడని గుర్తుంచుకోండి. మిమ్మలి ఒక ఉద్దేశ్యము నిమిత్తము ఆయన మిమ్మల్ని చేసి యున్నాడు మరియు మీ కొరకు ఒక ప్రత్యేకమైనది సిద్ధంగా ఉన్నది.
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను ప్రజలను సంతోష పెట్టుటకు ప్రయత్నిస్తూ జీవించాలని నేను ఆశించుట లేదు. నేను నీ కృపతో జీవించాలని మరియు మీరు నేనెలా ఉండవలెనని సృష్టించియున్నారో అలాగే ఉండాలని ఆశిస్తున్నాను.