ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు, దేవుడెవరిని ముందు ఎరిగెనో, వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. –రోమీయులకు 8:29
మనకొరకు పరిపూర్ణమైన, పాపములేని బలిగా యేసు భూమి మీదకు వచ్చాడు, ఎందుకంటే సహజ రాజ్యంలో పరిపూర్ణంగా ఉండగల సామర్ధ్యం మనకు లేదు. ఆయన బలి కారణంగా, మనము ప్రతిరోజూ యేసు మాదిరిగానే తయారవుతాము. యేసు జీవించుచున్నట్లుగా మానం జీవించినట్లైతే మనమ ఆత్మీయ వారసత్వాన్ని మనము స్వీకరిస్తాము.
ఇప్పుడు, యేసులా నీతిమంతుడైన జీవనము జీవించుట ఒక్క రాత్రిలో జరిగేది కాదు, మరియు మనమందరము తొట్రిల్లుతాము. ఒకవేళ మనము పరిపూర్ణంగా ఉంటే, మనకు రక్షకుని అవసరం లేదు! అయినప్పటికీ, మన ఆధ్యాత్మిక వారసత్వాన్ని నెరవేర్చడానికి మరియు ఆనందించేందుకు మన హృదయములో మనం కోరుకోవాలి. దేవుడు మనలను తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క పోలికగా అభివృద్ధి చేస్తాడని తెలుసుకోవడం ద్వారా, మనము దేవునిపై నమ్మకముంచుట నేర్చుకోవాలి.
ఎఫెసీయులకు 1:11-12 చెబుతుంది, మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తికలుగజేయవలెనని, దేవుడు తన చిత్తప్రకారమైన సంకల్పమునుబట్టి మనలను ముందుగా నిర్ణయించి, ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయము చొప్పున సమస్త కార్యములను జరిగించు చున్నాడు!
మీకు స్వాస్థ్యము ఉంది, మరియు మీరు ఎవరో మరియు మీరు ఎవరికీ చెంది యున్నారో తెలుసుకోవడము నుండి వచ్చిన శాశ్వత మరియు భద్రత భావాలతో నివసించాలని దేవుడు కోరుతున్నాడు.
మీరు దేవుణ్ణి విశ్వసిస్తారా, మరియు ఆయన మిమ్మును ప్రతిరోజూ ఆయన కుమారుని వలె మార్చుటకు అనుమతిస్తారా?
ప్రారంభ ప్రార్థన
దేవా, యేసులో నా ఆధ్యాత్మిక వారసత్వం కొరకు ధన్యవాదములు. నేను నీ యందు నమ్మిక యుంచి యున్నాను, నీవు నన్ను నీ కుమారుని యొక్క స్వరూప్యంలోనికి ఒక రోజులో తయారు చేయగలవని తెలుసుకొనుచున్నాను.