
జీవమునకు పోవు ద్వారము ఇరుకును ఆ దారి సంకుచితమునై యున్నది, దాని కనుగొనువారు కొందరే. —మత్తయి 7:14
దేవునిని అనుసరించుట అనగా “ఇరుకు మార్గము”లో నడచుట. అనగా వ్యతిరేకతను ఎదుర్కొనుట. ఇందులో ముందుకు సాగుటకు నాకు సహాయపడే అనేక విషయాలున్నాయి:
- దేవుని వాక్యము నా జీవితమునకు సరిహద్దుగా ఉన్నది. నేను దేవుని లేఖనము ద్వారా పొందుకొనిన నిబంధనలను మీరకుండా ఉన్నంత వరకు నేను క్రీస్తులో చేయాల్సిన మరియు ఉండవలసిన విధముగా ఉండుటకు నేను జ్ఞానము మరియు అవగాహనను కలిగి యుందును. దేవుడు నమ్మకమైన వాడు మరియు ఆయన వాక్యమునకు సత్యమై యున్నాడు.
- నేను ప్రారంభించిన దానిని ముగించునట్లు నేను ఇష్టపూర్వకముగా ఉండవలెను. దేవుడు ఉద్రేకముల చేత నడిపించబడని సమర్పణ కలిగిన ప్రజలను వాడుకుంటాడు. ఏదైనా నూతనమైన దానిని కలిగి యుండినప్పుడు ప్రారంభములో చాలా ఉత్తేజముగా ఉంటారు కానీ, ముగింపు గీతను దాటిన వారు లేక అక్కడే నిలిచిన వారు ఏమాత్రము ఉత్తేజముగా ఉండరు.
- నాకు సహాయం చేయుటకు ఎవరూ లేనప్పుడు, యేసు నిజముగా నాకు సహాయకుడని తెలుసుకుంటాను. దేవుని కొరకు జీవించే ఇరుకు మార్గము ఇహలోక మార్గములతో నడవదు కానీ కొన్నిసారు ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ క్రీస్తుతో నిజమైన సన్నిహిత్యం సంపాదించటానికి మీరు చేసే ప్రయత్నం మీరు ప్రపంచం నుండి ఎప్పుడైనా పొందగలిగే దానికంటే ఎక్కువగా ఉంటుంది.
ఈ సత్యములు మనకు సహాయపడినట్లుగానే మీకు సహాయపడతాయని నేను నమ్ముతాను. ప్రతికూలత ఉన్నప్పటికీ ఇరుకు మార్గములో నడచుట ద్వారా పొందే బహుమానములు పూర్తిగా యోగ్యమైనవని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి.
ప్రారంభ ప్రార్థన
పరిశుద్ధత్మా, క్రీస్తులో జీవపు మార్గమైన – ఇరుకు మార్గములో నేను నడచుటకు ఇష్టపడుతున్నాను. మీ సరిహద్దులలో నన్ను ఉంచండి మరియు చివరి వరకు పట్టుదలగా ఉండునట్లు నేనెలా జీవించాలో నాకు చూపించండి.