
…ఆయన చెడ్డవారిమీదను మంచివారిమీదను తన సూర్యుని ఉదయింపజేసి, నీతిమంతులమీదను, అనీతి మంతులమీదను వర్షము కురిపించుచున్నాడు. —మత్తయి 5:45
యోగ్యత లేని వారు దేవుని వద్ద నుండి ఆశీర్వాదములను పొందుకొనుట మీరెప్పుడైనా చుసియున్నారా? మిమ్మల్ని గాయపరచిన వారికి మేలు జరుగుట మీరెప్పుడైనా చుసియున్నారా?
మిమ్మల్ని గాయపరచిన వ్యక్తి ఆశీర్వదించబడినప్పుడు… అది మీ జీవితములో మిమ్మల్ని కన్నీరు పెట్టించగలదు …. కనీసం నేనెలా క్షమించగాలనో నేర్చుకునేంత వరకు అది నా జీవితములో జరుగుతుంది.
నీతిమంతులకు మరియు అనీతి మంతులకు కుడా మంచి మరియు చెడు జరుగుతుందని బైబిల్ చెప్తుంది. మిమ్మల్ని గాయపపరచిన వారు ఆశీర్వాదమును పొందుకొనియున్నట్లైతే, వారిని క్షమించుట చాల కష్టం కానీ, మీరు ఇప్పటికీ వారి కొరకు ప్రార్ధించుటకు పిలువబడ్డారు.
మీరు ఎవరితోనైనా గాయపరచబడినా లేక వారి ద్వారా విసుగుపుట్టినా మిమ్మల్ని గాయపరచిన ప్రజల కొరకు మీరు ఈరోజే ప్రార్ధించమని నేను మిమ్మును ప్రోత్సహిస్తున్నాను. మిమ్మల్ని గాయపరచిన వారి కొరకు మీరు ప్రార్ధించుట అనునది మీరు తీసుకునే ఎంపిక. క్షమించుట అనునది మీ నిర్ణయము మీదే ఆధారపడి యుంటుంది – కానీ మీ భావాల మీద కాదు. కానీ అది మీలో మీ స్వస్థత.
క్షమించే జీవిత శైలి మిమ్మును క్రీస్తువలే ఎక్కువగా మారుస్తుంది. మీరు క్షమించుటలోని ప్రాముఖ్యతను నేర్చుకొనుచు మరియు మిమ్మును గాయపరచిన వారు ఆశీర్వదించబడుట చూసినప్పుడు వారి కొరకు ప్రార్ధించుట ప్రారంభించినప్పుడు మీ హృదయము చేదు నుండి స్వస్థపరచబడుతుంది మరియు మీ వ్యక్తిగత ఎదుగుదల దేవుడు మీ కొరకు ప్రణాళిక చేసిన ఆశీర్వాదముల వద్దకు మిమ్మును నడిపించును.
ప్రారంభ ప్రార్థన
దేవా, అది కష్టమైనా నన్ను గాయపరచిన వారి కొరకు మరియు వారి ఆశీర్వాదముల కొరకు ప్రార్ధించవలెనని నేను ఎరిగి యున్నాను. క్షమించుట అనునది ఒక ఎంపిక కాబట్టి నేను క్షమించాలని ఆశించుచుండగా నాకు సహాయం చేయమని అడుగుతున్నాను.