
ఆ హేతువుచేత నా హస్తనిక్షేపణమువలన నీకు కలిగిన దేవుని కృపావరము (అంతరంగ అగ్ని) ప్రజ్వలింప (వెలిగించబడ వలెనని ) చేయవలెనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. —2 తిమోతి 1:6
దేవుని ప్రేమ అనునది నిబంధలు లేనిది మరియు నిత్యమైనది. అయన ప్రేమను నాకు ప్రత్యక్ష పరచినప్పుడు నేనెంత ఆశ్చర్యపడ్డానో మరియు ఉత్తేజముతో నిండియున్ననో నేను జ్ఞాపకము చేసుకోనుచున్నాను. నేను ఆత్మలో రగిలి పోతున్నట్లు భావించాను!
కానీ కొద్ది సమయం తరువాత, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడనే వాస్తావమును నేను గ్రహించాను మరియు నేను అదే భారమును తిరిగి భావించలేదు.
అది మీకెప్పుడైన సంభవించి యున్నదా? మీరు దానిని ఇప్పుడు అనుభవిస్తున్నారా? అలా అయితే, దానిని గురించి మీరు చేయాల్సినది ఒకటి ఉన్నది.
పౌలు తిమోతితో నిన్ను నీవే ప్రజ్వరింప జేయుమని చెప్పాడు మరియు జ్వాల వెలిగించమని మరియు మొదటిగా కలిగియున్న అగ్నిని మండించమని చెప్పాడు. పౌలు తిమోతికి చెప్పిన మాటలు ఈరోజు దేవుడు మీతో చెప్తున్నాడు: నిన్ను నీవే వెలిగించుకొనుము! పాత విషయాలతో నీవు విసిగి పోయియుండుట ఆపి వేయుము.
మనము దీనిని జ్ఞాపక ముంచుకోనవలెను: మీలో ఉన్నభారము ఒక భావనగా మారక ముందే ఒక నిర్ణయము తీసుకొనుము.
కాబట్టి ప్రతి రోజు ఉదయం లేచి మీ సృష్టికర్తతో మీరు కలిగియున్న మీ సంబంధమును గురించి మీరు ఉత్తేజం పొందండి. వెలిగించబడి అయనలో ఆనందించండి!
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను మీ ద్వారా ఎల్లప్పుడూ ఆనందిస్తాను! నేను ఆశ లేకుండా జీవించను. మిమ్మల్ని తెలుసుకొనుటయే యొక ఆనందం మరియు నేను మీతో కలిగియుండె సంబంధమును బట్టి ఆశ లేకుండా నేను జీవించను.