మీకు దేవుడిచ్చిన కలలు నెరవేర్చబడుట చూచుటకు మార్గము

మీకు దేవుడిచ్చిన కలలు నెరవేర్చబడుట చూచుటకు మార్గము

సోమరీ, చీమలయొద్దకు వెళ్లుము….. వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకున్నను అధిపతిలేకున్నను అవి వేసవికాలమందు ఆహారము సిద్ధపరచుకొనును కోతకాలమందు ధాన్యము కూర్చుకొనును. —సామెతలు 6:6-8

దేవుడు తన పిల్లలకు జీవితంలో కొనసాగడానికి పెద్ద కలలు ఇస్తాడు. ఆ కలలు నెరవేరాలంటే, వ్యక్తిగత అభివృద్ధి ప్రక్రియలో దేవునితో సహకరించి, శిక్షణలో సమయం గడపాలి. ఈ ప్రక్రియలో సమయం, సంకల్పం మరియు కృషి ఉంటాయి.

ఈరోజుల్లో మనము సౌకర్యములకు అలవాటుపడి యున్నాము. మనము వంట పాత్రలను శుభ్రం చేయడానికి ఆటోమేటిక్ డిష్ వాషర్లను మరియు బట్టలు ఉతికి ఆరబెట్టుటకు లాండ్రీ యంత్రములను వాడుతున్నాము. ఒక బటన్ నొక్కితే చాలు అదే పనంతా చేస్తుంది. కానీ దేవుని రాజ్యములో ఏదియు ఆటోమేటిక్ కాదు. అవసరమైన నైపుణ్యతలను అభివృద్ధి పరచకుండా మనము మన ప్రణాళికలను నెరవేర్చలేము.

సామెతల గ్రంధములో మనము చీమల గురించి చదువుతాము. చీమలు పరిమాణములో చిన్నవియైనా వాటి నుండి మనము చాల పెద్ద పాఠము నేర్చుకుంటాము: మనము కేవలం స్వయం ప్రేరణతో మరియు స్వీయ-క్రమశిక్షణతో ఉండాలి.

క్రీస్తు కొరకు జీవించుటలో మనం స్వయం ప్రేరణ మరియు స్వీయ-క్రమశిక్షణను అభివృద్ధి పరచుకున్నట్లైతే, దేవుడు మిమ్మల్ని ఏ ఉద్దేశ్యముతో సృష్టించి యున్నాడో ఆ విధంగా మీరు అనేక మందిని దేవుని యొద్దకు నడిపించు ప్రక్రియలో ఉంటారు. కాబట్టి ముందుకు సాగుతూ నిశ్చయతలో ఎదుగుతూ, మీ కలల నేరవేర్పును చూడండి!


ప్రారంభ ప్రార్థన

ప్రభువా, మీరు నా జీవితములో మీరేమి ఉంచారో దానిని నెరవేర్చబడుటకు సమస్తమును సృష్టించబడవలెనని కోరుతున్నాను. మీపై దృష్టి పెట్టడానికి నాకు సహాయపడండి మరియు క్రీస్తులో ఎదగడానికి అవసరమైన సమయం, సంకల్పం మరియు కృషిని కలిగి యుండుటకు మరియు మీరు నా కోసం కలిగి ఉన్న ప్రణాళికలలో జీవించుటకు సహాయం చేయండి.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon