
కాబట్టి యిప్పుడు క్రీస్తుయేసునందున్నవారికి ఏ శిక్షావిధియు (తప్పు చేసి యున్నామనే అపరాధ భావన) లేదు. —రోమా 8:1
నేను గొప్ప జన సముహముంతో మీలో ఎంత మంది అపరాధ భావనతో జీవిస్తున్నారని అడిగితే కనీసం 80% మంది ప్రజలు చేతులెత్తుతారని నేను ఉహిస్తున్నాను. నేను అపరాధ భావనతో నిర్మించబడలేదని నేను నిర్ణయించుకోనంత వరకు నేను కుడా ఆ 80%లో ఒకరుగా ఉంటాను, మరియు నేను నా జీవితమును అపరాధ భావన ఏలునట్లు నేను అనుమతించను.
నేను అపరాధ భావనను గురించి దేవుని వాక్యమును ధ్యానించి యున్నాను మరియు దేవుడు ఈ అపరాధ భావనకు ఆధారము కాదని నేను పూర్తిగా నమ్మనంత వరకు ఆయన గుణలక్షణములను నేను ధ్యానించి యున్నాను.
నేను అపరాధ భావనను మన మనస్సు మరియు మనస్సాక్షి పై దాడి చేసే అక్రమ ఆక్రమణ దారుడుగా నేను చూస్తాను మరియు తద్వారా దేవుడు మన కొరకు ఏర్పరచిన జీవితమును ఆనందించకుండా ఆపుతుంది. మన పాపములు మరియు దుష్కార్యములకు ప్రతిగా యేసు వెల చెల్లించి యున్నాడు కాబట్టి అపరాధమునకు మన మీద ఎటువంటి హక్కు లేదు. అది మనలో చట్ట విరుద్ధముగా ఉనట్లైతే, అప్పుడు మనము అది ఎక్కడ నుండి వచ్చిందో అక్కడికే అనగా – నరకానికే దానిని పంపించాలి!
అపరాధ భావన మీ ఆనందమును ఎంత మాత్రమూ దొంగిలించకుండా ఆపండి. మీరు అపరాధ భావన కొరకు నిర్మించబడ లేదని మీరు జ్ఞాపకముంచుకొనవలెను. ఏ సమయంలో నైనా మీరు దేవుని ప్రేమ మరియు కృపను పొందుకొనుట ద్వారా దీనితో క్రోధంగా వ్యహరించండి.
ప్రారంభ ప్రార్థన
పరిశుద్ధాత్మ దేవా, నేను అపరాధ భావన కొరకు నిర్మించబడలేదని నాకు తెలుసు! ప్రతిసారీ నాలో అపరాధ భావన తలెత్తినప్పుడల్లా దానిని నా దృష్టికి తీసుకొని రండి మరియు నేను యేసు చేసిన త్యాగము ద్వారా క్షమించబడ్డాననీ సంపూర్ణత కలిగి యున్నానని నాకు గుర్తు చేయండి.