
ఇప్పుడైతే దేనిచేత నిర్బంధింపబడితిమో దానివిషయమై చనిపోయినవారమై, ధర్మశాస్త్రమునుండి విడుదల పొందితివిు గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీనస్థితి (విధేయత) గలవారము కాక ఆత్మానుసారమైన నవీనస్థితి గలవారమై సేవచేయుచున్నాము. —రోమా 7:6
అనేకమంది ప్రజలు ఒత్తిడితో మరియు భారముతో నలిగిపోవుటకు గల ప్రధాన కారణమేదనగా వారు దేవుని ప్రణాళికను అనుసరించకుండా వారి స్వంత మార్గములలో వారు వెళ్తున్నారు.
మనం దేనిలో పాలుపంచుకోవాలి మరియు మన శక్తిని ఎక్కడ ఖర్చు చేయాలి అనే దానిపై మనం పరిశుద్ధాత్మ నాయకత్వాన్ని అనుసరించాలి. ఆయన అవును అని చెప్పినప్పుడు అవును అని చెప్పడం నేర్చుకోవాలి. మనము దేవుని నాయకత్వానికి విధేయత చూపినప్పుడు, ఆయన మనకు ఏమి చేయాలో మరియు శాంతితో నడవడానికి మనకు సామర్ధ్యమును ఇవ్వగలడు.
రోమా 7:6 చెప్పునదేమనగా మనము పరిశుద్ధాత్మద్వారా నడిపించబడవలెను. అనేక సార్లు నేను అలసి పోయినప్పుడు నాతో పరిశుద్ధాత్మ దేవుడు విశ్రాంతి తీసుకోమని చెప్పినప్పుడు నేను బయటికి వెళ్లి స్నేహితులతో ఉండాలని కోరుకునే దానిని. నేను కేవలం అలసిపోవుటతో పాటు పూర్తిగా నీరసించి సహనాన్ని కోల్పోయే దానిని.
మనము పరిశుద్ధాత్మ నడిపింపుకు విధేయత చూపినప్పుడు యేసు హెచ్చింపబడతాడు. కాబట్టి నన్ను ఇలా అడగనివ్వండి: నీవు అలసిపోయావా… లేక యేసు హెచ్చింప బడియున్నాడా? పరిశుద్ధాత్మను అనుసరించండి మరియు ఆయనను మీ జీవితములో హెచ్చించండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను నీ మాటలు వినుటకు నేను అలసిపోవాలని ఆశించుటలేదు. నేను మీ ప్రణాళికలను అనుసరిస్తూ నా జీవితములో మిమ్మును హెచ్చించాలని ఎంపిక చేసుకొని యున్నాను.