మరియు ఆయనమీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మీరెట్టి కొలతతో కొలుతురో మీకును అట్టి కొలతతోనే కొలువబడును, మరి ఎక్కువగా మీ కియ్యబడును. —మార్కు 4:24
మీరు ఒక విశ్వసియైనట్లైతే, మీరు ప్రతి దినమంతయు మీరు లేఖనాధరమైన ఆలోచనలను ఆలోచిస్తూ ఉండండి కానీ దీనిని గురించి ఆలోచించండి: మీరు వాటిని వ్యతిరేక తలంపులతో కలుపుతున్నారా లేక మీ మనస్సుకు వచ్చే ఏ ఆలోచనతోనైనా కలుపుతున్నారా?
దాదాపు నా జీవితమంతయు, నేను కేవలం నా తలలో ఏ ఆలోచన వస్తే దానిని గురించే ఆలోచించే దానిని. నా తలలో వచ్చే ఆలోచనలన్నియు ఎక్కువగా సాతనుడి అబద్ధములు లేక కేవలం వ్యర్ధ ఆలోచనలే.
మార్కు 4:24 చదవండి. అది మనకు ఎక్కువ సమయం దేవుని వాక్యమును గురించి, అధిక శక్తి మరియు సామర్ధ్యముతో మనము అందులో నడుచుట గురించి అలోచించమని చెప్తుంది. మనము ఎంత ఎక్కువగా వాక్యమును చదువుతామో మరియు వింటామో, దానిని అర్ధం చేసుకొనుటకు అంత ఎక్కువ ప్రత్యక్షతను మనము పొందుకుంటాము.
శరీరకముగా మనము చాలా సోమరితనమును కలిగియుండి మనస్వంతగా మనమేమీ పని చేయకుండా దేవుని దగ్గర నుండి ఏదైనా పొందుకోవాలని ఆశిస్తాము, కానీ అది ఆ విధంగా పని చేయదు. మీరే ఏమి చేయగలుగుతారో అంతగా మీరు వాక్యము నుండి పొందుకో గలుగుతారు.
మీరు ప్రతి దినము దేవుని వాక్యమును ధ్యానించవలసినదిగా నేను మిమ్ములను ప్రోత్సహిస్తున్నాను, ఎందుకంటే మీరు దానిని ఆస్వాదించుటకు ఖర్చు చేసే ప్రతి నిమిషము ద్వారా మీరు దేవుని నుండి జ్ఞానము మరియు వివేచనను పొందుకుంటారు.
ప్రారంభ ప్రార్థన
ప్రభువా, నేను ప్రతి దినము మీ వాక్యములో ఎక్కువ సమయమును గడుపుటకు నేను ఒక నిర్ణయమును తీసుకుంటాను. నేను దానిని చేయుచుండగా, దాని నుండి నేను ఎక్కువగా పొందుకుంటానని మరియు మీ నుండి జ్ఞాన వివేచనములను పొందుకుంటానని నాకు తెలుసు.