మీరు ఇవ్వగలిగిన గొప్ప బహుమానము

మీరు ఇవ్వగలిగిన గొప్ప బహుమానము

కాబట్టి మీ తండ్రి కనికరముగలవాడై యున్నట్టు మీరును కనికరముగలవారై (జాలిగల, సున్నితమైన, స్పందించే మరియు కనికరముగల వారై) యుండుడి.   —లూకా 6:36

ఇది చాల దారుణమైన విషయం. నేను దీనిని గురించి ఎంతగా ఆలోచిస్తున్నట్లైతే, నేను అంతగా ఆశ్చర్యపోతాను. యోగ్యతలేని ఆశీర్వాదములను ఇస్తూ, యోగ్యమైన శిక్షను నిషేధిస్తుంది. ఇది మీరు మరొకరికి ఇవ్వగల గొప్ప బహుమనమై యున్నది.

ఈ బహుమానమును కనికరము అంటారు. చూడండి, యేసు కనికరమును అనుగ్రహించుటకు ఈ లోకమునకు వచ్చియున్నాడు, కనుక మనము కూడా ఇతరులకు కనికరమును ఇచ్చుట నేర్చుకొనవలెను.

క్రీస్తు ఉదాహరణ ద్వారా, మన శత్రువులను ప్రేమించి వారి కొరకు ప్రార్ధించుట మనకు నేర్పబడి యున్నది. మనము ఏ విధముగా ఇతరులు మనలను చూడాలని ఆశిస్తామో అలా మనలను చూడకపోయినా వారితో మనము స్నేహముగా ఉండునట్లు నేర్పబడ్డాము. మనకు తిరిగి చెల్లించలేని వారి కొరకు అనగా బీద మరియు నిస్సహాయులైన వారికి సహాయం చేయవలెనని మనకు నేర్పబడి యున్నది.

మనము తిరిగి బహుమనములను ఇచ్చే వారికే మనము ఇస్తాము. కానీ మనకు తిరిగి ఇవ్వలేని వారి కొరకు మనము సహాయము చేయుట ఎన్నుకొనినట్లైతే మనము ధన్యులము – అదియే కనికరము చూపుట.

మీరు దేవునికి ఇచ్చే గొప్ప బహుమానము ఎదనగా యేసు వలె ఎక్కువగా మారుట. ఆయన మిమ్మల్ని ఎలా చూసియున్నాడో అలాగే ఇతరులను చూచుట ద్వారా మీరు దీనిని చేయగలరు. మీ నుండి ఎన్నడూ పొందలేని గొప్ప బహుమానమును మీ చుట్టూ ఉన్న వారికి ఇచ్చుట – అదియే కనికరము.


ప్రారంభ ప్రార్థన

దేవా,  మీరు నాకు అనుదినము స్వార్ధము లేకుండా ఇచ్చే కనికరమును నాకు అనుగ్రహించినందుకు వందనములు. నేను ఆ కనికరమును ఇతరులకు చూపాలని నేను ఇప్పుడే ఎన్నుకొని యున్నాను. నేను పొందే ప్రతి అవకాశమును మీరు నా యెడల చూపిన కనికరమును ఇతరులకు చూపుట ద్వారా నేను ఉపయోగించు కుంటాను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon