మీరు ఈరోజే యుద్దమును గెలవగలరు

మీరు ఈరోజే యుద్దమును గెలవగలరు

శరీరాను సారమైన మనస్సు మరణము; …..(పరిశుద్ధ) ఆత్మానుసారమైన మనస్సు జీవమును (ప్రాణమును) సమాధానమునై యున్నది. —రోమా 8:6

ఇప్పుడు మీరు మరియు నేను యుద్ధం మధ్యలో ఉన్నాము. ఇది ఆత్మీయ యుద్ధ రంగము మరియు పోరాడునది అధికారులతోను అంధకార సంబంధమగు లోకనాధులతో మరియు దుష్టశక్తులతో పోరాడుతున్నాము (ఎఫెసీ 6:12). మనము యుద్దమును గెలుచుటకు పరిశుద్ధాత్ముని మనస్సును మనము కలిగి యుండవలెను.

విచారకరముగా, అనేకమంది విశ్వాసులు శరీరానుసారమైన మనస్సును కలిగి యుంటున్నారు. కానీ మనము మన ప్రపంచమును మార్చగల మార్గములో జీవించాలని ఆశించినట్లైతే, అప్పుడు మనము శారీరకముగా జీవించుట మానివేసి ఆత్మలో జీవించుట ప్రారంభిస్తాము.

మనలో ప్రతి ఒక్కరము శరీర కోరికలను పరిశుద్ధాత్మ స్వాదీనమునకు అప్పగించుటలో దిద్దుబాటులను కొనసాగిస్తూ ఉండునట్లు మన ఉద్రేకములు మనలను పరిపాలించకుండా ఉండునట్లు అనుమతించ వలసియున్నది. లేఖనములు వివరించునదేమనగా ఆత్మ శరీరమునకు మరియు శరీరము అత్మకును వ్యతిరేకముగా పోరాడును కాబట్టి అవి ఒకదానితో ఒకటి ఎల్లప్పుడూ విరోధముగా పని చేయును.

ఇది ఒక యుద్ధము! సాతానుడు మనలను ద్వేషిస్తాడు మరియు అతడు నిరంతరము అతిగా పని చేస్తూ ఉంటూ, మనము శారీరకముగా జీవించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు.

చిట్ట చివరకు మీ జీవితమును ఎవరు గెలుచుకుంటారో మీరు నిర్ణయించండి. శుభవార్త ఏమనగా మీరు మీ శరీరమునకు లోబడి యుండనవసరం లేదు. మీరు ఆత్మలో జీవిస్తూ మీ శరీరమును అయన చిత్తమునకు లోపరచుకోనవచ్చును. ఈరోజే మీ యుద్దమును మీరు గెలవవచ్చును!


ప్రారంభ ప్రార్థన

 

దేవా, నేను ఈరోజే యుద్దమును గెలవాలని ఆశిస్తున్నాను. నేను జీవమును మరియు సమాధానము అనుగ్రహించే పరిశుద్ధాత్మ మనస్సును కలిగి యుండాలని ఆశిస్తున్నాను. మీ ఆత్మను నేను ఈరోజు ఎన్నుకొనుచున్నాను. మీ చిత్తముకు నా శరీరమును లోపరచునట్లు మీరు సహాయం చేయండి.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon