… కక్షచేతనైనను వృథాతిశయముచేతనైనను ఏమియు చేయక, వినయమైన మనస్సుగలవారై యొకనినొకడు తనకంటె యోగ్యుడని యెంచుచు మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను. —ఫిలిప్పి 2:3-4
ఫిలిప్పి 2:3 తెలియజేయునదేమనగా తనకంటే మరియెకని యోగ్యుడుగా ఎంచుట. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఇతరులను యోగ్యులుగా ఎంచుట మరియు వారి అవసరతలను తీర్చుటయనే ఆశను అభివృద్ధి చేయవలెనని ఆశిస్తున్నాడు. ఏది ఏమైనా ఈ విధముగా నివసించుట కొన్నిసార్లు అలసటగా ఉండవచ్చు. మనము దీనిని ఎదుర్కొందాము – మనము ఇతరులకు సహాయం చేయుటకు సిద్ధముగా లేని రోజులు మనందరి జీవితములలో ఉన్నాయి.
కొన్నిసార్లు నేను చేయాలని ఆశించిన సహాయమును ఇతరులకు చేయుటకు సంతోషిస్తాను. కొన్నిసార్లు నా కుటుంబ సభ్యులందరికీ, నా స్నేహితులందరికీ నేను అవసరమవుతాను – మరియు వారందరూ నన్ను విభిన్న మార్గములలో కోరుకుంటారు.
నేను ఎప్పుడైనా ఎవరికైనా ఖచ్చితముగా అవసరముగా ఉన్నానా? అవును! నీవు దీనిని చేస్తే మంచిదే. మనమందరమూ అనేకసార్లు ఉప్పొంగిపోతాము. కానీ దేవుడు మనలను ఏమి చేయమని చెప్పిన దానిని చేయుటకు ఆయన తన కృపను మనకు అనుగ్రహిస్తాడు.
మనము ఇతరుల అవసరతలను తీర్చుటలో అలసిపోయినట్లైతే, ఫిలిప్పి 2:3 చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేస్తాడు. దేవుని యెదుట మిమ్మును మీరు తగ్గించుకొనిన యెడల ఆయన మిమ్మును బలపరచి దేవుడు ఎవరికైతే మిమ్మును సహాయం చేయమని చెప్తున్నాడో వారికి సహాయం చేయుటకు మీకు సహాయం చేయును.
ప్రారంభ ప్రార్థన
దేవా, నేను నాకంటే ఇతరులను గౌరవించాలని ఆశిస్తున్నాను. నేను కష్టపడుతున్నప్పుడు, ఇతరులకు సహాయపడ వలెననే ఆశ కోల్పోయినప్పుడు మీ కృపను నాకు అనుగ్రహించి నేను ఎవరికి సహాయం చేయాలని నీవు ఆశిస్తున్నావో వారిని ప్రేమించుటకు నాకు బలమును అనుగ్రహించుము.