మీరు ఒంటరిగాలేకపోయినా ఒంటరితనమును కలిగి ఉండవచ్చు

మీరు ఒంటరిగాలేకపోయినా ఒంటరితనమును కలిగి ఉండవచ్చు

భయపడకుడి, వారిని చూచి దిగులుపడకుడి, నీతో కూడ వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే; ఆయన నిన్ను విడువడు నిన్నెడబాయడు.  —ద్వితీయోపదేశ కాండము 31:6

ఒంటరితనము తరచుగా అంతరంగ బాధ, ఖాళీ లేక ప్రేమ కొరకు ఆశించుట వలె కనపడుతుంది. అది ఖాళీ, నిరుపయోగమైన మరియు ఉద్దేశ్యములేని అంతరంగ భావనలతో కూడిన ప్రభావమై యున్నది. అనేక కారణములున్నాయి, కానీ దానితోనే జీవించవలసిన అవసరం లేదనే విషయాన్ని గుర్తించరు. వారు దానిని ఎదుర్కొన గలరు మరియు దానితో వ్యవహరించగలరు.

మీరు ఒంటరిగా ఉన్నారనుట అనగా మీరు ఒంటరిగా జీవించాలని అర్ధం కాదనే విషయాన్ని గుర్తించుట చాలా ప్రాముఖ్యమైనది.  ఒంటరిగా ఉండుట ఎల్లప్పుడూ సాధ్యం కాదు కాబట్టి ఒంటరితనమనే బాధ నుండి విడిపించబడుటకు ఒక మార్గము కూడా కలదు.

దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉంటాడు గనుక మనము బలమును మరియు ప్రోత్సాహమును కలిగి యుండాలని దేవుని వాక్యము చెప్తుంది.  భౌతికముగా మీరు ఒంటరిగా ఉండవచ్చు, కానీ మీరు ఒంటరిగా ఉన్నారని అర్ధం కాదు ఎందుకనగా అత్మీయముగా దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు.  ఆయన మిమ్మును ఎన్నడు విడువడు ఎడబాయడు.

ఎప్పుడైనా మీకు ఒంటరితనమనే భావన కలిగినప్పుడు ద్వితీయోపదేశ కాండము 31:6 చదవమని నేను మిమ్మును బ్రతిమాలుచున్నాను. దేవుడు మీతో ఉన్నాడు మరియు ఆయన మీతో మాట్లాడుతాడని స్వరమేత్తి పలకండి. మీరు ఆయనకు స్థానమిచ్చుచుండగా, ఆయన సన్నిధి మీ జీవితములో నింపబడును గాక.  మీరిక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి మీతో వచ్చును కాబట్టి మీరు ఒంటరిగా భావించనవసరం లేదు.


ప్రారంభ ప్రార్థన

దేవా, మీరు ఎల్లప్పుడూ నాతో ఉన్నందుకు నేనెంతో ఆనందిస్తున్నాను. మీరు నా ప్రక్కనే ఉన్నందుకు నేనెప్పుడు ఒంటరిగా భావించను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon