
ఇయ్యుడి, అప్పుడు మీకియ్యబడును; అణచి, కుదిలించి, దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరల కొలువబడునని చెప్పెను.- లూకా 6:38
కొంత డబ్బును మరియు లేక లోకపు లెక్కల పద్దతిని దేవుని ఎదుట పెట్టండి. కానీ ప్రకటన 18లో బైబిల్ చెప్తున్నదేమనగా మన నమ్మకమును డబ్బు మీద ఉంచిన యెడల అది విఫలమవుతుంది. డబ్బును వ్యవహరించుటకు నేను ఒక సులభమైన పద్ధతిని కనుకొన్నాను: దేవునికి ఇచ్చుటకు ప్రయత్నించండి. (సత్యమేదనగా మీరు నిజముగా దేవునికి ఇవ్వలేరు, కానీ మీరు ప్రయత్నిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.)
మనము ఎంతగా ఇస్తే… మన ఆర్ధిక వనరులతో ఎంతగా మనము దేవునికి విధేయత చూపిస్తే, అంతగా ఆయన మనలను ఆశీర్వదించును. మనము ప్రజలకు ఎంత ఎక్కువగా పని చేస్తూ ఉంటే, మనము ఆనందముగా ఉంటాము మరియు గతము కంటే ఎక్కువగా నేరవేర్పును చూస్తాము.
సమాజము మనకు సమస్తమును లోకపరమైన పద్ధతులకే పెట్టుబడి పెట్టాలని మరియు ఎక్కువ ధనము సంపాదించుటకు సమయాన్నంతా వెచ్చించాలని చెప్తుంది. కానీ మనము దానిని చేసినప్పుడు మనము పొందవలసిన ఆనందమును పొందలేము. మనము మన ధనమును దేవుని మార్గములో వెచ్చించుట లేదు కాబట్టి మనము ఆనందించ లేము.
లోక పద్ధతిని అనుసరిస్తే దానికి విలువ ఉండకపోవచ్చు కానీ దేవుడు కేవలం ధనము సంపాదించి దానిని దాచి పెట్టుకోమని చెప్పుట లేదు. దానిని ఇచ్చుట ద్వారా మీరు ముగింపులో మరి ఎక్కువగా పొందుకుంటారని దేవుడు చెప్తున్నాడు. ఈ రోజు మీరు మీ దాత్రుత్వమును పెంచమని మీకు సవాలు చేస్తున్నాను. నన్ను నమ్మండి – మీరు దేవునికి ఇవ్వకుండా ఉండలేరు.
ప్రారంభ ప్రార్థన
దేవా, నా ఆర్ధిక విషయాలలో మీరు కలిగియున్న ప్రణాళిక లోకము వంటిది కాదని నాకు తెలుసు. కానీ మీరు చెప్పిన విధముగా నేను ధనమును ఇచ్చినట్లయితే మీరు నా గురించి శ్రద్ధ తీసుకుంటారని నాకు తెలుసు. నా ధనము మీది మరియు మీ చిత్త ప్రకారముగా నేను దానిని వాడుతాను.