మీరు దేవునికి క్రొత్త కాదు

మీరు దేవునికి క్రొత్త కాదు

 గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని, నీవు గర్భమునుండి బయలుపడక మునుపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. – యిర్మియా 1:5  

దేవుడు మీతో ఎప్పుడైనా నిరుత్సాహ పడ్డాడని భావించారా? ఒకరోజు ఆయన నాతో, “జాయిస్ నీవు నాకెప్పుడు క్రొత్త కాదు. నేను నిన్ను చూసినప్పుడు నేనేమి పొందుకున్ననో నాకు తెలుసు” అన్నాడు.

దీనిని గురించి ఆలోచించండి! దేవునికి ఆరంభము నుండి అంతము తెలుసు మరియు మన జీవితములోని సమస్త దినములన్నియు అయన పుస్తకములో లిఖించబడి యున్నది. మనము తీసుకునే మంచి లేక చెడ్డ నిర్ణయం ఏదైనా భూమి ఉపరితలము మీద చూపించబడును. మన నోటినుండి పలుకబడని ప్రతి మాట కుడా ఆయనకు తెలుసు – ఇప్పటి నుండి ఒక సంవత్సరము వరకు మనము పలుకబోయే ప్రతి మాట ఆయనకు తెలుసు.

కొన్నిసార్లు మనము తిరుగుతూ మన గురించి దేవుడెంతో నిరుత్సాహ పడుతున్నాడని మనము ఆలోచిస్తూ ఉంటాము.  మనము పొరపాట్లు చేస్తామనునది ఒక వాస్తవము. మనము వాటిని గురించి తేలికగా తీసుకోలేము – వాటిని మనము చాలా గంభీరముతో తీసుకోనవలెను. కానీ మన పొరపాట్లు ఉన్నప్పటికీ, మనము దేవునికి సన్నిహితముగా ఉన్నప్పుడు దేవుడు మన యెడల ఒక నిరీక్షణను కలిగి యున్నాడు మరియు మనల్ని అయన మార్చగలడని ఆయనకు తెలుసు.

దేవుడు నిరుత్సహపడలేదు. మనము ఎక్కడైతే ఆలోచిస్తున్నామో దానిలో అయన పూర్తీ నిరీక్షణయై యున్నాడు. మన గురించి మనము నమ్ముట కంటే దేవుడే మనలో గొప్ప నమ్మకమును కలిగి యున్నాడు.

ప్రారంభ ప్రార్థన

ప్రభువా, నా యెడల మీరు కలిగియున్న నిరీక్షణ మనకు చాల ప్రోత్సాహకరముగా మరియు ఉత్తేజ పూర్వకముగా ఉన్నది. నేను నా గురించి నేను విశ్వసించకుండా ఉన్నప్పుడు, మీరు విశ్వాసమును కలిగి యున్నారని నాకు తెలుసు మరియు నా పొరపాట్లను జయించుట, అది నాకు శక్తిని అనుగ్రహించును మరియు మిమ్మును అనుసరించుటకు సహాయపడును.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon