
కాగా శరీరస్వభావము (వారి శరీర స్వభావం యొక్క ఆకలి మరియు ప్రేరణలకు అనువుగా) గలవారు దేవుని సంతోషపరచ నేరరు. —రోమా 8:8
మన ఉద్రేకములను కాక ఆత్మను అనుసరించవలసిన అవసరతను గురించి నేను చాలా మాట్లాడి యున్నాను. ఏది ఏమైనా అనేక మంది ప్రజలు మన ఉద్రేకములు ప్రధమ స్థానంలో ఉన్నాయని కనీసం అర్ధం చేసుకోరు.
ఉద్రేకములు ప్రాణము యొక్క పరిధిలో ఉంటాయి. మన ప్రాణము మన మనస్సు, చిత్తము మరియు ఉద్రేకములతో తయారు చేయబడుతుంది – అది మన దేనిని గురించి ఆలోచిస్తామో, మనమేమి కోరుకుంటున్నామో మరియు మనమెలా భావిస్తున్నామనే విషయాలను గురించి మాట్లాడుతుంది. ఆత్మ యొక్క ఈ మూడు ప్రాంతములలో మన ఉద్రేకములు చాలా వేగముగా కదులుతాయి.
మరో మాటలో చెప్పాలంటే, మన ఆత్మలోని పరిశుద్ధాత్మ యొక్క జ్ఞాన వివేచనలు ఉద్రేకముల ఆక్రందనలు సులభముగా మునిగిపోతాయి.
బైబిల్ చెప్తున్నా దేమనగా “ఈ లోక జీవితం” దేవునిని సంతోషపెట్టదు. దేవుడు ప్రేమించడని దీని అర్ధం కాదు. దీని అర్ధమేదనగా ఆయన దీనిని గురించి సంతృప్తి పడడు లేక ఆయన శారీరక వైఖరిని అంగీకరించడు.
ఏది ఏమైనా, ఉద్రేకములు ఎంత వ్యతిరేకముగా పని చేస్తాయనే విషయాలు ఒక్కసారి అర్ధం చేసుకుంటే, మీరు వాటిని జయించగలరు. మన ఆత్మలు ఒకవేళ బలముగా ఉండవచ్చు, కానీ వాటిని మనము దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపుట ద్వారా వాటిని బలపరచినట్లైతే మనము మన ఆత్మలు బలపడతాయి. ఈరోజు వాక్యములోనికి వెళ్ళుము మరియు మీ ఉద్రేకములను జయించుటకు మీ ఆత్మకు బలమును అందించండి.
ప్రారంభ ప్రార్థన
దేవా, నా ఆత్మమీద నా ఉద్రేకములు శక్తిని కలిగియుండుట నాకు ఇష్టం లేదు. నేను మీతో మరియు మీ వాక్యముతో సమయమును గడుపుచుండగా కేవలం నా భావనలతో కాక, ఆత్మతో నడిపించబడునట్లు నాకు నీ శక్తిని అనుగ్రహింపుము.