మీరు యధార్ధతను మాట్లాడునట్లు సరిగా అలోచించుము

మీరు యధార్ధతను మాట్లాడునట్లు సరిగా అలోచించుము

నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాపప్రపంచమై సర్వశరీరమునకు మాలిన్యము కలుగజేయుచు, ప్రకృతి చక్రమునకు (మనవ స్వభావము యొక్క చక్రమునకు) చిచ్చుపెట్టును; అది నరకముచేత చిచ్చు పెట్టబడును. —యాకోబు 3:6

ప్రతికూల వాక్యములు ప్రతికూల ఆలోచనలతో ప్రారంభమగును. ఉదాహరణకు, ఒక ఉద్యోగి తాను పనిచేసే సంస్థ కొంతమంది ఉద్యోగులను తొలగించబోతున్నట్లు ఒక పుకారు విన్నాడనుకుందాము, కాబట్టి అతను అనుకుంటాడు, ప్రతిసారీ విషయాలు బాగుగా జరగడం ప్రారంభించినప్పుడు, ఏదైనా చెడు ఎప్పుడూ జరుగుతుంది అని అతను అనుకుంటాడు. అప్పుడు అతడు, “ఒకవేళ నేను నా ఉద్యోగమును పోగుట్టుకుంటాను.” అని అనుకుంటాడు.

నా ఆలోచనలు చాల ప్రతికులముగా ఉండేవి, వాటి ద్వారా నా మాటలు ప్రతికూలముగా ఉండేవి… అవి నా జీవితమును ఎంతో ప్రభావితము చేసేవి. చివరకు నేను నా మార్గములను మార్చుకోవాలని ఆశించి ప్రతికూలముగా మాట్లాడుట ఆపి వేసి యున్నాను. కొంత కాలము తరువాత, నేను కేవలం ప్రతికూలముగా మాట్లాడుటకంటే ఎక్కవ చేయాల్సి ఉందని గుర్తించి యున్నాను. ప్రతికూల మాటలు పలుకుట ఆపివేయుట మాత్రమె చాలదు – నేను అనుకూలముగా ఆలోచించుట ప్రారంభించాలి!

మన ఆలోచనలు – అనుకూలమైనా ప్రతికూలమైనా – మన భవిష్యత్తును రూపు దిద్దే మాటలు మాట్లాడుటకు కారణమవుతాయి. మనము తప్పు మాటలు మాట్లాడినప్పుడు, అది మన జీవితాల్లో అగ్నిగా మారుతుంది (యాకోబు 3:6 చూడండి).

సరిగ్గా మాట్లాడటం ద్వారా అగ్ని మొదలయ్యే ముందు మనం దానిని ఆపవచ్చు మరియు మనం సరిగ్గా ఆలోచించినప్పుడు మాత్రమే మాట్లాడగలం. పరిశుద్ధాత్మ మరియు దేవుని వాక్యంతో నిండి ఉండాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆయన మీ ఆలోచనలను ప్రభావితం చేసి, అనుకూల మాటలు మాట్లాడే జీవనశైలికి మిమ్మల్ని నడిపించునట్లు అనుతించండి.


ప్రారంభ ప్రార్థన

దేవా, మీ వాక్యమును ఆధారముగా చేసుకొని అనుకూల, జీవము నిచ్చే మాటలను మాట్లాడాలని నేను ఆశించుచున్నాను. నేను నా ఆలోచన జీవితములోనికి నిన్ను ఆహ్వానిస్తున్నాను మరియు నూతన పరచబడిన మనస్సును కలిగి యుండాలని ఆశిస్తున్నాను, తద్వారా నా నోటి మాటలతో నిన్ను సంతోష పరచగలను.

Facebook icon Twitter icon Instagram icon Pinterest icon Google+ icon YouTube icon LinkedIn icon Contact icon